November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: ఆడపిల్లలు పుట్టడమే శాపమా?.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. భర్త చనిపోయిన నెలకే..

ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న కారణంగా ఓ వివాహితను అత్తింటివారు ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పటికే మొదటి కాన్పులో ఓ ఆడపిల్ల ఉండగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త ఇటీవల ప్రమాదంలో చినిపోయాడు. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉంటే మరోవైపు రెండో కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారన్న సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటూ ఆ బాలింతను అత్తమామలు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన ముగ్గురు ఆడపిల్లలతో ఆ తల్లి అత్తింటి ముందు మౌనపోరాటానికి దిగింది.

Also read :Well: మాయదారి నీళ్ల బావి.. ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురిని వరుసగా మింగేసింది!

బాపట్లజిల్లా చీరాల మండలం కొత్తపాలెంకు చెందిన మణికంఠరెడ్డి, కుసుమాంజలి 2021లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో మణికంఠరెడ్డి తమ్ముడికి పెళ్ళయింది. తమ్ముడి కోడలు కట్నం తీసుకొచ్చిందని, నీ భార్య కట్నం తీసుకురాలేదంటూ ఇంట్లో అత్తమామలు మణికంఠరెడ్డిని నిలదీయడం ప్రారంభించారు. దీంతో మణికంఠరెడ్డి కూడా భార్యను ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో గొడవలు పెద్దవి కావడంతో విషయం పోలీసులు, పెద్ద మనుషుల వరకు వెళ్ళింది. పెద్ద మనుషుల జోక్యంతో తిరిగి ఇద్దరూ కాపురం చేసుకుంటున్నారు. కుసుమాంజలి మళ్ళీ గర్భం దాల్చింది.. అయితే 20 రోజుల క్రితం మణికంఠరెడ్డి పొలంలో పనిచేస్తూ ట్రాక్టర్‌ కింద పడి ప్రమాదవశాత్తూ చినిపోయాడు. ఆ దుఖం దిగమింగేలోపే కుసుమాంజలికి అత్తమామల నుంచి వేధింపులు మళ్ళీ మొదలయ్యాయి. భర్త చనిపోవడానికి ముందే నిండు గర్భణిగా ఉన్న కుసుమాంజలికి వారం రోజుల క్రిందట డెలివరీ అయింది. ఈ రెండవ కాన్పులో ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మనిచ్చింది. దీంతో మొత్తం ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో ఇష్టం లేని అత్తమామలు తనను ఇంటిలోకి రానివ్వడం లేదని కుసుమాంజలి మౌనపోరాటానికి దిగింది. తన కన్నవాళ్ళతో కలిసి అత్తింటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ముగ్గురు ఆడ పిల్లలు పుట్టారని అత్తమామలు ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఓ వైపు భర్తను కోల్పోయిన కూసుమంజలి పుట్టెడు దుఖంలో ఉండగా, మరోవైపు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని ఇంటిలోనికి రానివ్వకపోవటం ఎంత వరకు సమంజసమని కుసుమాంజలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Also read :Hyderabad: బరితెగించిన సైబర్ బూచోళ్లు.. మెయిల్‌ హ్యాక్‌ చేసి ఏకంగా రూ.11.4 కోట్లు దోచేశారు!

Andhra Pradesh: అయ్యో దేవుడా.. ఇంటర్వ్యూకి హాజరై చంటిబిడ్డతో ఇంటికి బయలుదేరారు.. ఇంతలోనే ఊహించని ప్రమాదం..

తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదనే విషయం మీకు తెలుసా.. ? కారణం ఇదేనట..!

నేటి జాతకములు. 10 జూలై, 2024

Related posts

Share via