February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: మరో మస్తాన్ సాయే.. సెల్‌ఫోన్లో ఆ వీడియోలు, ఫొటోలు..? ఆ సంబంధాలతో రచ్చకెక్కిన ఉన్నతాధికారి..



ప్రేమించానన్నాడు.. పెళ్ళి చేసుకుంటానన్నాడు.. పిల్లలు పుట్టక పోయిన పర్వాలేదన్నాడు… కులాలు అడ్డురావన్నాడు.. ఆమె జీవితానికి భరోసాగా ఉంటానన్నాడు. ఇలా ఎన్నో మాటలు చెప్పి.. ఆమెను 1998లో వివాహం చేసుకున్నాడు. అప్పట్లో జీవిత భీమా సంస్థలో పని చేసే కిరణ్, అనసూయలు ప్రేమించుకున్నారు. కులాలు ఒకటి కాకపోయినా పెద్దలు ఒప్పుకోకపోయిన, పిల్లలు పుట్టరని తెలిసినా అనసూయను కిరణ్ వివాహం చేసుకున్నాడు.


ప్రేమించానన్నాడు.. పెళ్ళి చేసుకుంటానన్నాడు.. పిల్లలు పుట్టక పోయిన పర్వాలేదన్నాడు… కులాలు అడ్డురావన్నాడు.. ఆమె జీవితానికి భరోసాగా ఉంటానన్నాడు. ఇలా ఎన్నో మాటలు చెప్పి.. ఆమెను 1998లో వివాహం చేసుకున్నాడు. అప్పట్లో జీవిత భీమా సంస్థలో పని చేసే కిరణ్, అనసూయలు ప్రేమించుకున్నారు. కులాలు ఒకటి కాకపోయినా పెద్దలు ఒప్పుకోకపోయిన, పిల్లలు పుట్టరని తెలిసినా అనసూయను కిరణ్ వివాహం చేసుకున్నాడు. పాలకొల్లులో ఇద్దరూ కలిసి పని చేస్తున్న సమయంలోనే ఇద్దరూ జీవిత భాగస్వాములయ్యారు. కొద్ది కాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. మొదట ఒక పాపను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత కిరణ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు మారాడు. ఆ తర్వాత సరోగసి విధానంలో మరొక బాబును కన్నారు. ఆ తర్వాత నుండి ఇద్దరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ అనసూయను వేధించడం మొదలు పెట్టాడు. ఉద్యోగ రిత్యా ఇతర ప్రాంతాల్లో పని చేస్తూ అక్కడ మహిళలతో సంబంధాలు ఏర్పరుచుకునేవాడు.. వారిని అనసూయ లేని సమయంలో ఇంటికి తీసుకొని వచ్చేవాడు. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసుకొని వాటిని అనసూయకు పంపేవాడు.


దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. అనసూయ ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తుండగా, కిరణ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో డిఐజి స్థాయికి ఎదిగాడు. వీరి కుమార్తె ప్రస్తుతం ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళింది.

అయితే ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న కిరణ్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. తరుచూ ఆమెను కొడుతుండేవాడు. అడ్డువచ్చిన కూతురు, కొడుకును కొట్టేవాడు.


ఈ మధ్య కాలంలో కొడుకును తనకివ్వాలంటూ ఆమెతో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆమెపై దాడి చేసి తీవ్రంగా హింసించాడు. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అనసూయ ఆమె తల్లిదండ్రులు సాయంతో అరండల్ పేట స్టేషన్ కు వచ్చి కిరణ్ పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కిరణ్ పై గృహహింస వేధింపుల కేసు పెట్టారు.

మరో మస్తాన్ సాయి..
ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వారి ఫోటోలు, వీడియోలు తీసి దాచుకుంటున్నట్లు అనసూయ ఆరోపిస్తుంది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు పోలీసులకు ఇస్తానంటుంది. తనకు అన్యాయం చేసిన కిరణ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేశారని తనకు న్యాయం చేస్తారని అంటుంది

Also read

Related posts

Share via