ఆరుగాలం కష్టపడి సేద్యం చేశారు.. నిత్యం పొలంలోనే ఉంటూ పంటను పండించారు.. చివరకు పంట చేతికి వచ్చింది.. దళారి వచ్చి పంటను కొనుగోలు చేశాడు.. అంతా అయిపోయింది.. డబ్బులు చేతికి వస్తాయనుకున్న క్రమంలో దళారి రైతులను నట్టేట ముంచుతూ నిర్ణయం తీసుకున్నాడు.. రైతులను మోసం చేయడంతోపాటు.. నోటీసులు పంపడం సంచలనంగా మారింది.
ఆరుగాలం కష్టపడి సేద్యం చేశారు.. నిత్యం పొలంలోనే ఉంటూ పంటను పండించారు.. చివరకు పంట చేతికి వచ్చింది.. దళారి వచ్చి పంటను కొనుగోలు చేశాడు.. అంతా అయిపోయింది.. డబ్బులు చేతికి వస్తాయనుకున్న క్రమంలో దళారి రైతులను నట్టేట ముంచుతూ నిర్ణయం తీసుకున్నాడు.. రైతులను మోసం చేయాలని ఆ వ్యాపారికి ఎలా మనసు వచ్చిందో ఏమో కానీ.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల రూపాయలకు టోపి పెట్టాడు.. రైతులకు బకాయి పడి నిలువునా మోసం చేశాడు.. రైతులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగితే.. ఏకంగా కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపించాడు ఆ వ్యాపారి.
అనంతపురం ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలంలో దాదాపు 200 పైచిలుకు మంది రైతుల నుంచి విక్రమ్ అనే వ్యాపారి వేరు శనగలు కొనుగోలు చేశాడు. దాదాపు 5 కోట్ల రూపాయలు విలువచేసే శనగలు కొనుగోలు చేసిన వ్యాపారి విక్రమ్.. ఏడాది గడుస్తున్నా రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించలేదు. రైతులు ఎప్పుడు డబ్బులు అడిగినా.. ఇదిగో అదిగో అంటూ మభ్యపెడుతూ వచ్చాడు.
ఏడాది గడిచినా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న శనగల వ్యాపారి విక్రమ్ ను రైతులు తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో వ్యాపారి విక్రం బెలుగుప్ప నుంచి మకాం బళ్లారికి మార్చాడు. ఎన్ని రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు బెలుగుప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విక్రమ్ కు రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో బళ్లారి నుంచి వేరే గుర్తు తెలియని ప్రాంతానికి మకాం మార్చాడు. ఐదు కోట్ల రూపాయలు ఎగ్గొట్టేందుకు వ్యాపారి విక్రమ్ 200 మంది రైతులకు ఐపి పెట్టి నోటీసులు పంపాడు.. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఐదు కోట్ల రూపాయలు మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన విక్రమ్ ఐపీ నోటీసులు పంపించడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి బెలుగుప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను రైతులు వేడుకున్నారు. ఎండనక… వాననక పండించిన పంటను వ్యాపారి చేతిలో పోసి… మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక రోజు తమ డబ్బులు వస్తాయనుకుంటే.. ఐపీ నోటీసులు రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎలాగైనా తమ సమస్యను పరిష్కరించాలని రైతులు పోలీసులను కోరుతున్నారు.
Also read
- Garuda Puranam: భర్తలు జాగ్రత్త.. మీ భార్యని ఇలా బాధపెడుతున్నారా.. గరుడ పురాణం ప్రకారం ఏఏ శిక్షలో తెలుసా..
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- తెలంగాణ: కాళ్ళ పారాణింకా ఆరనే లేదు.. 22 రోజులకే నవ వధువు మృతి!
- డెలివరీ అయిన మూడు రోజులకే వారి ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు.. టెక్ బిలియనీర్ భార్య సంచలనం!
- జిమ్ నిర్వాహకుడిని చంపిన యువకుడు.. డంబెల్స్‌తో కొట్టి కొట్టి….