అనకాపల్లి: రైల్వే స్టేషన్ వద్ద అదృష్టం లేకుండా, కదులుతున్న రైలుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి నరకయాతన అనుభవించాడు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కబోతూ, ప్లాట్‌ఫారమ్ రైలు భోగి మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘోరం అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.
ప్రమాదాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ప్రయాణికుడిని రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య నుంచి బయటకి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. డ్రిల్లర్లతో ప్లాట్‌ఫారమ్ కొంత భాగాన్ని ధ్వంసం చేసి, చాలా కష్టపడిన తర్వాత అతన్ని బయటకు తీశారు. అయితే అప్పటికే అతనికి తీవ్ర గాయాలైన అతన్ని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఆ వ్యక్తి పైలా రాజబాబుగా గుర్తించారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం తోటకూర పాలెంకు చెందిన రాజబాబు వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!