అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయిపై డ్రోన్లతో దాడి చేస్తున్నారు పోలీసులు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఆ డ్రోన్లు వెతికి పట్టుకున్న విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.!
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖ జిల్లాతో ముడిపడి ఉంటున్నాయి. దీంతో అక్కడ మూడో నేత్రం తెరుచుకుంది. డ్రోన్ల సాయంతో గంజాయి నిర్మూలన కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పట్టిన మత్తుని వదిలించేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈగల్ టీమ్.. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్ల సహాయంతో పెదబయలు మండలం పాతపాడులో గంజాయి సాగు గుర్తించారు అధికారులు.
ఫారెస్ట్ రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎనిమిది ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయి తోటను ధ్వంసం చేశారు. గంజాయిని ఎక్కడ సాగు చేసినా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. గిరిజనులు గంజాయి జోలికి వెళ్లొద్దని… ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుందన్నారు. ఐజి రవికృష్ణ, ఎస్పీ నగేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తంగా గంజాయి సాగు, వాడకంపై మున్ముందు వణుకుపుట్టించేలా యాక్షన్ ఉంటుందంటున్నారు పోలీసులు. గంజాయి చూస్తేనే గజగజ వణికే పరిస్థిలొస్తాయని హెచ్చరిస్తున్నారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు