తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తోపులాట జరిగింది. భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించారు.
తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితోపాటు మరో ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి విజిలెన్స్, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. గురువారం, డిసెంబర్ 9 తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీంతో బుధవారం సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ క్యూలైన్లలో బారులు తీరారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు భారీగా రావడంతో క్యూలైన్లలో తోపులాట జరిగింది. దీంతో భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తోపులాట జరిగింది. భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో నలుగురు భక్తులు మృతి చెందారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా గురువారం నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు ఒకరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించేందుకు మెయిన్ గేట్ ఓపెన్ చేశారు. దీంతో ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున దూసుకు రావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
జనవరి 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు గానూ 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టికెట్ల జారీ టీటీడీ ఏర్పాట్లు చేసింది.
ప్రభుత్వం అండగా ఉంటుందిః నారా లోకేష్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు. నలుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర మనోవేధనకు గురిచేసిందన్నారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలకు తావీయకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
ప్రాణాలు కోల్పోవడం విచారకరంః వైఎస్ జగన్
తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు
Also read oi
- Mastan Sai Arrest: సెలబ్రిటీల బాత్రూమ్, బెడ్రూముల్లో స్పై కెమెరాలు.. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌తో ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ!
- ఛీ ఛీ.. ఏం కొడుకుల్రా మీరు.. తండ్రి శవాన్ని ముక్కలుగా నరికి
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..