అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ.. విపరీతమైన కడుపునొప్పి రావడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లారు. . అక్కడ స్కాన్ చేయించిన డాక్టర్లు కడుపులో కణితి వంటిది ఉన్నట్లు గుర్తించారు. ఎంఆర్ఐ స్కాన్ చేయించి చూసి.. వైద్యులు నిర్ఘాంతపోయారు.
విశాఖపట్నంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ భరించలేని కడుపునొప్పితో కేజీహెచ్‌కు వచ్చింది. వెంటనే టెస్టులు చేసిన డాక్టర్లు.. రిపోర్టులు చూసి స్టన్ అయ్యారు. ఆమె కడుపులో ఎముకల గూడు ఉన్నట్లు నిర్ధారించి నిర్ఘాంతపోయారు. వెంటనే సర్జరీ చేసి.. ఎముకలు తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడంతో.. ఇక పిల్లలు వద్దనుకుని.. అబార్షన్ కోసం మెడిసిన్ వాడారు. ఆ తర్వాత నుంచి ఆమెకు కడుపు నొప్పి ఉండేది. అయితే ఇటీవలే ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో.. ఆగస్టు మూడో వారంలో కేజీహెచ్ ప్రసూతి విభాగ ప్రొఫెసర్ డాక్టర్ వాణిని సంప్రదించారు.
వెంటనే బాధితురాలికి డాక్టర్ వాణి.. అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి కడుపులో కణితి వంటిది ఉందని భావించారు. అనంతరం మరింత స్పష్టత కోసం MRI స్కాన్ చేయగా.. 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తేలింది. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. అత్యంత అరుదుగా ఇలా జరుగుతుందని డాక్టర్లు చెప్పారు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ‘లితోపెడియన్’గా వ్యవహరిస్తారని కేజీహెచ్ డాక్టర్లు వెల్లడించారు. ఇలాంటి సందర్బాల్లో మరణించిన పిండం కాల్సిఫై అవుతుంది. డేటా ప్రకారం.. ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా 25 కన్నా తక్కువ నమోదయ్యాయట. కేజీహెచ్‌లో డా.ఆనంద్ టీమ్‌తో కలిసి డాక్టర్ వాణి గత నెల 31న ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని శిశువు ఎముకల గూడును రిమూవ్ చేశారు. బాధితురాలు ఇప్పుడు బాగా కోలుకుంటుందని.. కొద్దిరోజుల్లో ఆమె డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని కేజీహెచ్‌లోని పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద తెలిపారు
తాజా వార్తలు చదవండి
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం