November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

బాపట్ల కేంద్రీయ విద్యార్థులకు అస్వస్థత – 21 మందికి వాంతులు

– గుర్తుతెలియని పౌడర్‌ మిశ్రమాన్ని పీల్చిన వైనం


Andhra Pradesh: తరగతి గదిలో విద్యార్ధినుల అత్యుత్సాహం.. ఆసుపత్రిపాలైన 24 మంది విద్యార్ధులు..!
అది బాపట్లలోని కేంద్రీయ విద్యాలయం. ఉదయం పదకొండు గంటల సమయం.. ఆరో తరగతి గదిలో టీచర్ పాఠాలు చెబుతున్నారు. సైన్స్ పాఠం చెబుతూ సులభంగా అర్ధం అవ్వటానికి క్లోరో‌ఫిల్, నిమ్మ ఉప్పు కలిపి ప్రయోగం చేసి చూపించారు.

అది బాపట్లలోని కేంద్రీయ విద్యాలయం. ఉదయం పదకొండు గంటల సమయం.. ఆరో తరగతి గదిలో టీచర్ పాఠాలు చెబుతున్నారు. సైన్స్ పాఠం చెబుతూ సులభంగా అర్ధం అవ్వటానికి క్లోరో‌ఫిల్, నిమ్మ ఉప్పు కలిపి ప్రయోగం చేసి చూపించారు. ఈ ప్రయోగం చేసిన కొద్దిసేపటి తర్వాత టీచర్ ఆ పదార్ధాలను అక్కడే ఉంచి బయటకు వెళ్లారు. దీంతో ఒక విద్యార్ధిని అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, టీచర్ అక్కడ వదిలి వెళ్లిన మిశ్రమానికి మరికొన్ని పదార్ధాలను కలిపింది.

క్లోర్‌ఫిల్‌కు నిమ్మ ఉప్పు కలిపిన మిశ్రమానికి కాఫి పొడి, శానిటైర్, పంచదార, ఉప్పు కలిపింది. దీంతో ఒక్కసారిగా పొగలు ఎగసిపడ్డాయి. ఆ పొగ ఎదురుగా ఉన్న ఏడో తరగతి గదిలోకి వ్యాపించింది. ఈ పొగ పీల్చిన విద్యార్ధునులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురయ్యారు. మొదట ముగ్గురు విద్యార్ధులు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే స్పందించి వారిని సూర్యలంక ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుండి బాపట్లలోని ఏరియా హాస్పిటల్ కు పంపించారు.

అయితే ఆ ముగ్గురే కాకుండా ఆరు, ఏడు తరగతుల్లోని మరో 22 మంది విద్యార్ధిని, విద్యార్ధులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరందరిని బాపట్ల‌లోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స చేశారు. అందరూ కోలుకోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్ధుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఒక్కసారిగా పదుల సంఖ్యలో విద్యార్ధులు అస్వస్థతకు గురికావడంతో మొదట స్కూల్లో ఆ తర్వాత ఆసుపత్రిలో కలకలం రేగింది. మొదట ఏంజరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. ఆ తర్వాత ఆరో తరగతి విద్యార్ధులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. టీచర్ ప్రయోగం చేసి బయటకు వెళ్లిన తర్వాత అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన ఒక విద్యార్ధిని చేసిన తప్పిదంతో చాలా మంది ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Also read

Related posts

Share via