SGSTV NEWS online
Andhra PradeshCrimeSpiritual

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ





ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రసాదంలో కల్తీ జరిగిందని సిట్ నివేదికలో ప్రస్తావించింది. 2022-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ నివేదికలో వెల్లడించింది

ఏలూరు జిల్లా, ఫిబ్రవరి 12 : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల (చిన్న వెంకన్న) ఆలయంలో ప్రసాదాల తయారీలో కల్తీ జరిగిందని సిట్ (Special Investigation Team) నివేదికలో ప్రస్తావించింది. సిట్ నివేదిక వెల్లడించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్వామివారికి ఎంతో పవిత్రంగా భావించి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడినట్లు తేలడంపై భక్తుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

SIT నివేదికలోని ముఖ్యాంశాలు..

ద్వారకా తిరుమల ఆలయ వ్యవహారాలపై దర్యాప్తు జరిపిన సిట్, తమ నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. 2022 నుంచి 2024 మధ్య కాలంలో ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ కాలంలో ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. చిన్న వెంకన్న ఆలయంలో లడ్డూ, చక్కెర పొంగలి, స్వామివారి ఇతర కైంకర్యాలకు నెలకు సుమారు 15 వేల కేజీల నెయ్యి వినియోగిస్తారు.

స్వామివారి ప్రసాదంలో కల్తీ జరగడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి ప్రసాదాన్ని పవిత్రంగా భావించి స్వీకరిస్తామని భక్తులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ కల్తీ నెయ్యిని ఎలా గుర్తించలేకపోయారని, అధికారుల పర్యవేక్షణ లోపం దీనికి కారణమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ద్వారకా తిరుమల ఆలయ కల్తీ వివాదంపై సిట్ నివేదిక సంచలనం సృష్టించగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

Also read

Related posts