మీ జేబులో కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఉంటే అవి ఒరిజినలో డూప్లికేటో చెక్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాలను దొంగ నోట్ల ముఠాలు హడలెత్తిస్తున్నాయి. కోట్ల విలువైన నకిలీ నోట్లను సర్క్యులేషన్‌లోకి పంపిస్తున్నాయి. పోలీసులు తీగ లాగితే… ఎక్కడెక్కడో.. ఈ దొంగ యవ్వారం బయటపడుతుంది. దొంగ నోట్ల తయారీని కుటీర పరిశ్రమలా నడుపుతున్నారు కేటుగాళ్లు
ఇండియాని పట్టిపీడిస్తున్న సమస్యల్లో నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఫేక్ కరెన్సీ మోసాలు తగ్గడం లేదు. నకిలీ నోట్లు ముద్రించినా , చెలామణి చేసినా.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినా ఏమాత్రం జంకడం లేదు నకిలీగాళ్లు. ఇచ్చట అచ్చమైన, స్వచ్ఛమైన 500 రూపాయల నోట్లు తయారు చేయబడును. సరసమైన ధరలకు అమ్మబడును అంటూ ఆఫర్లు ఇస్తున్నారు డూప్లికేట్ బ్యాచ్. కోట్ల రూపాయల టర్నోవర్‌తో చీకటి దందాకు తెరలేపుతున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు… వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ ముద్రించడానికి వాడిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్ రిపేరులో భాగంగా మెకానిక్‌కి దొంగ నోట్లు ఇచ్చారు. దీంతో ఆరా తీస్తే ముఠా గుట్టు రట్టయింది. ఒక లక్షకి మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నారు. గుంటూరు బాలాజీనగర్ స్లమ్‌ను డెన్‌గా ఏర్పాటు చేసి నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో చూసి దొంగ నోట్లు ఎలా చేయాలో ప్లాన్ చేశాడు మధు అనే వ్యక్తి. విజయవాడకు చెందిన మధుబాబు మరో వ్యక్తి మణికుమార్‌తో కలిసి నకిలీ నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు. కాగా అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు