కలిసుందాం..రా! అని ఆమె. ఇంత జరిగాక ఇక తగ్గేదే లేదనేది ఆయన వాదన. ఇదీ దువ్వాడ కుటుంబ వివాదంలో తాజా అప్‌డేట్. తనకు ఆస్తులు అక్కర్లేదు. కుటుంబం అంతా కలిసి వుండడమే ముఖ్యమన్నారు వాణి.. కానీ రాజీ మార్గానికి ఎప్పుడో చేయిదాటిపోయిందన్నారు దువ్వాడ. బంధువుల రాయబేరం వర్కవుట్ కాలేదు. పరస్పర కేసులతో వివాద బంతి కోర్టుకు చేరింది.
పతీ..పత్నీ ..ఔర్ వో.. సంచలనం రేపిన దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో వివాదం కొత్త టర్న్ తీసుకుంటోంది. పరిష్కారానికి దారేదనే కన్‌ఫ్యూజనే తప్పా క్లారిటీ రావడంలేదు. ఐదు డిమాండ్లతో బంధు పెద్దలు సంప్రదింపులు జరిపారు. కానీ రాయబారాలు అంతగా ఫలించలేదు. మరోవైపు పరస్పర ఫిర్యాదులతో మ్యాటర్ కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఇక వాణీ ఇద్దరు కూతుళ్లు పదిరోజులుగా దువ్వాడ ఇంటి ముందున్న గ్యారేజీలోనే నిరసన తెలుపుతున్నారు. దువ్వాడ మాత్రం ఇంటి గడప దాటి బయటకు రావడంలేదు. తాజాగా రాజీ మార్గంగా వాణీ తన బాణీ విన్పించారు. రాజకీయాలు, ఆస్తులు తనకు అక్కర్లేదన్నారు. తమను ఇంట్లోకి రానిస్తే చాలన్నారు. కూతుళ్లు భవిష్యత్ కోసం.. సమాజం కోసం అందరం కలిసి వుండాలన్నదే తమ అభిమతమన్నారు. అందులో భాగంగా ఎలాంటి షరతులకైనా తాము సిద్ధమని వాణీ తెలిపారు.
కూతుళ్ల భవిష్యత్ కోసం.. సొసైటీ కోసం కలిసి ఉండాలంని వాణీ చెప్పారు. కానీ దువ్వాడ మాత్రం ఆ ఒక్కటి తప్ప దేనికైనా రెడీ అనే.. పట్టును మాత్రం వీడటంలేదు. తనకున్న 30 కోట్ల ఆస్తుల్లో 27 కోట్ల ప్రాపర్టీని రాసివ్వడానికి సిద్ధమని స్పష్టంచేశారు. జరగాల్సిన డ్యామేజీ జరిగింది. కొత్త ఇంటి జోలికి రావద్దని తెలిపారు. ఇంత జరిగాక కలిసివుండడం కదురదంటూ పేర్కొన్నారు. అయితే.. పిల్లల బాధ్యత తనదేనన్నారు. వివాదం కోర్టు దాకా వెళ్లింది కాబట్టీ న్యాయస్థానం తీర్పు ప్రకారమే నడుచుకుంటానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు.
అంతకుముందు.. తన నివాసంలోకి చొరబడ్డారని దువ్వాడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాణీకి 41-A నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చారు. అయితే ఆ నోటీసులు తీసుకునేందుకు వాణి నిరాకరించారు. తాను కూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చానని, ముందు ఎమ్మెల్సీ దువ్వాడకు నోటీసు ఇచ్చి, తర్వాతే తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక తనపై, తన కూతురిపై దాడి చేశారని వాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడపై కేసు నమోదయింది. తనపై నమోదు చేసిన గృహహింస కేసులో 21న వాయిదాకు హాజరు కావాల్సి ఉందని దువ్వాడ చెప్పారు. తనపై వాణీ ఫిర్యాదు చేసిన రోజే తాను విడాకుల నోటీస్ పంపానన్నారు. కానీ వాణీ మాత్రం తనకు అలాంటి నోటీసులు ఏవీ అందలేదన్నారు
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం