అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కేతా బాపూజీ అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందాడు. ఇటీవలే బాపూజీ కొడుకు ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లాడు. ఓ వైపు తండ్రి మరణం, మరోవైపు పరాయిదేశం నుంచి అతను రాలేని పరిస్థితి. ఈ క్రమంలో…
తెలుగు రాష్ట్రాలనుంచి చాలామంది బ్రతుకు తెరువుకోసం ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. కన్నవారిని అవసాన దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు ఆర్ధిక ఇబ్బందులతో పొట్టకూటి కోసం గుండె రాయి చేసుకొని విదేశాల్లో కష్టపడుతున్నారు. దారుణం ఏంటంటే.. కన్నవారిని కడసారి చూసుకునేందుకు కూడా కొందరు నోచుకోవడంలేదు. పున్నామ నరకం నుంచి తప్పించడానికి పుత్రుడు తప్పక కావాలి అని తపించిన తల్లిదండ్రులకు ఆ భాగ్యం కూడా దక్కడం లేదు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. కొడుకు బ్రతుకు తెరువుకోసం మస్కట్ వెళ్ళగా తండ్రి బ్రెయిన్ డెడ్‌తో మరణించాడు. అంతిమ సంస్కారాలు చేయాల్సిన కొడుకు స్థానంలో కోడలు నిలిచి మామకు తలకొరివి పెట్టిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కేతా బాపూజీ అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందాడు. ఇటీవలే బాపూజీ కొడుకు ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లాడు. ఓ వైపు తండ్రి మరణం, మరోవైపు పరాయిదేశం నుంచి అతను రాలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోయాడు బాపూజీ కుమారుడు. ఈ క్రమంలో బాపూజీ కోడలు దుర్గాభవాని కొడుకు స్థానంలో నిలబడి మామగారిని తండ్రిగా భావించి స్వయంగా పాడె మోసి, తలకొరివి పెట్టి అంతిమ సంస్కారం జరిపించింది. దుర్గా భవాని స్పందించిన తీరుపై ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్టులు ప్రశంసలు కురిపిస్తున్నారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..