July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

చెక్‌పోస్ట్ వద్ద కంటైనర్ ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా కళ్లు జిగేల్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి అధిక మొత్తంలో తరలిస్తున్న నగదు, నగలు, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుని సీజ్‌ చేస్తున్నారు. తాజాగా….


ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తనిఖీలు విసృతంగా చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద భారీగా బంగారం, వెండి పట్టుబడింది.  సుమారుగా రూ.8.15 కోట్ల రూపాయలు విలువైనటువంటి 1.764 కేజీల బంగారు నగలు, 58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా చెక్ పోస్ట్ బృందం పట్టుకొని సీజ్ చేసినట్లు రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పి అంబికా ప్రసాద్ తెలిపారు. రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించి, స్వాధీనం చేసుకుని ట్రెజరీలో భద్రపరిచారు. రాజమండ్రి ప్రముఖ నగల దుకాణానికి ఆ నగలను తీసుకు వెళ్తున్నట్టుగా గుర్తించారు.


ధవళేశ్వరం సిఐ జివి వినయ మోహన్… నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్‌కు సమాచారం తెలియజేశారు. వారి ఆదేశాల ప్రకారం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రూరల్ మండలం తహసీల్దార్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంచార్జ్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ డి. గోపాలరావు బృందం, ఇన్కమ్ టాక్స్, జిఎస్టి అధికారుల బృందాలు చెక్‌పోస్ట్ వద్దకు చేరుకుని అధికారులందరి సమక్షంలో కంటైనర్‌ను  ఓపెన్ చేసి..  ఆభరణాలు రవాణా చేస్తున్నట్టుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆదేశాల ప్రకారం ఆభరణాలను జిల్లా ట్రెజరీలో భద్రపరచడం తెలిపారు.

కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో బంగారం వ్యాపారులు.. నగదు, ఆభరణాలు తీసుకెళ్తుంటే.. సరైన పత్రాలు క్యారీ చేయడం అత్యవసరం. ఏ డాక్యూమెంట్ లేకపోయినా మీ సరుకు చిక్కుల్లో పడింది. ఎన్నో తంటాలు పడితేనే ఆ సొత్తు తిరిగి వస్తుంది. ఒక్కోసారి రాకపోవచ్చు కూడా. అందుకే బీ అలెర్ట్.

Also read

Related posts

Share via