ఓ వ్యక్తి 11 ఏళ్ల తన దాంపత్య జీవితంలో తన అడుగులో నీడై నడుచుకుంటున్న తన భార్య కోసం అలా ఎలా ఆలోచించాడో, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలియదు కానీ, ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
సమస్య ఏదైనా ఎలా మొదలవుతుందో, ఎక్కడ మొదలవుతుందో కనీసం ఆలోచన చేయకుండా కొంతమంది క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఓ నిండు ప్రాణం బలైపోవడమే కాకుండా.. కుటుంబం మొత్తం ఛిన్నా భిన్నం అవతుంటాయి. అన్యం పుణ్యం తేలియాని చిన్నారులు సైతం రొడ్డున పడుతుంటారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో కూడా ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి 11 ఏళ్ల తన దాంపత్య జీవితంలో తన అడుగులో నీడై నడుచుకుంటున్న తన భార్య కోసం అలా ఎలా ఆలోచించాడో, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలియదు కానీ, ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
క్షణికావేశంలో ఓ వ్యక్తి తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లి తానే ఈ హత్య చేశానని లొంగిపోయాడు. అయితే ఈ దారుణమైన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవి పల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర (33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కాగా, వీరికి వరుణ్(10), జయవర్థన్(8) అనే ఇద్దరు పిల్లు ఉన్నారు. ఇకపోతే ఈ దంపతుల మధ్య ఏడాది నుంచి వివాదలు జరుతున్నాయట.
అయితే ఈ వివాదాలు మరీంత ఎక్కువవ్వడంతో.. ఇటీవలే ఈ దంపతులు స్వగ్రామానికి వెళ్లారు. కానీ, మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సోమవారం భార్యభర్తల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. దీంతో లావణ్య దుస్తులు సర్దుకుని తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ విషయం పై ఇరుగు పొరుగు వారు ఎంత సర్ది చెప్పిన వినలేదు. చివరికి మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో.. మహేంద్ర క్షణికావేశంతో కత్తి తీసుకుని తలపై కొట్టి, గొంతు కోశాడు.
దీంతో లావణ్య చనిపోవడంతో.. తన ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్ కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు. దీంతో ఎస్ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. అనంతరం కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ, క్షణికావేశంలో తండ్రి చేసిన పనికి ఆ పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. తల్లి మరణించి, తండ్రి జైలుకెళ్లడంపై ఆ చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక ఆ చిన్నారుల రోదన చూసిన స్థానికులంతా కంటతడి పెట్టారు.
Also read
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
- అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
- ఎస్బీఐ బ్యాంకుకు కన్నం.. రూ.13 కోట్ల విలువ చేసే బంగారం లూటీ.. లబోదిబోమంటున్న కస్టమర్లు
- స్కూల్‌కి వెళ్లాల్సిన బాలుడు.. బావిలో శవమై తేలాడు.. మిస్టరీగా మారిన మరణం