ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది . సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పార్థసారధి మీడియాకు వెళ్లడించారు.
స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది
రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్‌ను రద్దు చేసి స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది
ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ
జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో.. రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్‌లో తీర్మానం చేశారు
నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ
జిల్లాల్లో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం
రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు
గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం
3 నెలలపాటు 22ఏలోని భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత
సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు
గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన 217 జీవో రద్దు
Also read :
- అనారోగ్యంతో బాధపడుతున్నారా.. ఆదివారం ఈ పరిహారాలు చేసి చూడండి..
- నేటి జాతకములు 24 నవంబర్, 2024
- Ganesha Temple: పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే..
- ప్రియురాలితో DEO రాసలీలలు.. భార్య ఎంట్రీతో.. చివరకు ఏం జరిగిందంటే?
- Andhra Pradesh: ఆ దేవాలయం చుట్టూ పక్షుల ప్రదక్షిణలు.. దేవుడి మహిమే అంటున్న గ్రామస్తులు