అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి మూడుముళ్ళు వేసిన భర్తే తన భార్యతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించాడు. తాజాగా ఆమె చేసిన వీడియో వైరల్ కావడంతో ఆ భార్య తనకు వద్దని వేధిస్తున్నాడు. తన సమస్యను పోలీసులకు చెబుతామని వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగకపోగా వేధింపులు తప్పలేదు.
WIFE NUDE CALL : అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి మూడు ముళ్ళు వేసిన భర్తే తన భార్యతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించాడు. తాజాగా ఆమె చేసిన వీడియో వైరల్ కావడంతో ఆ భార్య తనకు వద్దని విడాకులు కావాలని వేధిస్తున్నాడు. తన సమస్యను పోలీసులకు చెబుతామని వెళ్తే అక్కడ కూడా ఆ మహిళకు అక్కడ న్యాయం జరగకపోగా వేధింపులు తప్పలేదు.
వివరాల ప్రకారం తిరుపతి జిల్లా కుప్పం బాదురు, కొత్త కండ్రిగకు చెందిన వివాహిత భర్త వేధింపులపై మీడియాను ఆశ్రయించారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భర్త మునిరత్నం రెడ్డి భార్యతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించి నగదు వసూలు చేయిస్తున్నాడు.తమ ఆర్థిక పరిస్థితి భాగాలేదని, ఆన్ లైన్ లో న్యూడ్ కాల్స్ చేస్తే భాగా సంపాదించవచ్చని నమ్మబలికాడు. లక్షలు సంపాదించినా ఇంకా కాల్స్ చేయాలని ఒత్తిడి తేవడంతో ఆ భార్య నిరాకరించింది. దీంతో తను చచ్చిపోతానంటూ బ్లాక్ మెయిల్ మొదలు పెట్టాడు. చామెట్ (ఛిల్ల్ చాట్) యాప్ లో తన భార్య పేరుతో మునిరత్నంరెడ్డి ఐడీ క్రియెట్ చేశాడు. అయితే పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. ఇక మీదట నేను న్యూడ్ కాల్స్ చేయనని తెగేసి చెప్పడంతో ఆమెను కొట్టి, తిట్టి బలవంతంగా న్యూడ్ కాల్స్ చేయించాడు. దీంతో ఆమె ఇంటినుంచి వెళ్లిపోయి తన కూతురుతో కలిసి జీవిస్తున్నా వేధింపులు ఆపలేదు. భర్త వద్ద ఉన్నా మరో కూతరును చూడడానికి వెళ్లిన సమయంలో ఆమెపై దాడి చేసి గాయపరిచాడు.
ఇదిలా ఉండగా ఆమె చేసిన ఒక న్యూడ్ వీడియో కాల్ ను గుర్తు తెలియని వ్యక్తి వక్తి వైరల్ చేశాడు. దీంతో ఆమెను చులకనగా చూడడంతో పాటు విడాకులు కావాలని వేధిస్తున్నాడు. దీంతో న్యాయ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే వారు కూడా చులకనగా హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన చెందుతోంది. తన వీడియో కాల్ వైరల్ కావడంతో తన వద్ద ఉన్న 18 లక్షలు, బంగారు నగలు తీసుకుని ఆమెను దూరం పెట్టాడని వాపోయింది. మహిళా పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ కూడా న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే కానిస్టేబుల్ నన్ను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఆర్సిపురం కానిస్టేబుల్ అసభ్యకర మెసేజులు పెట్టి… రాత్రికి రావాలంటూ వేధింపులకు గురి చేశాడంటూ ఆమె ఆరోపించింది. తన ఎదుగుతున్న ఇద్దరు బిడ్డలను కూడా అదే రకంగా వేధించి కాల్స్ చేయించే ప్రమాదం ఉన్నందున తన బిడ్డలను తనకు ఇప్పించాలని ఆ మహిళ డిమాండ్ చేస్తోంది.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





