తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మళ్ళీ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. హైవే పక్కనే ఉన్న కొత్తపాళెం లే అవుట్‌లోని ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించిన దొంగలు మొత్తం దోచుకెళ్లారు. సత్యనారాయణ రెడ్డి ఇంట్లోకి భారీగా చోరీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక గదిలో నిద్రిస్తుండగా ఇంటికున్న కిటికీ బోల్టులను తొలగించి ఇంట్లోకి ప్రవేశించింది చెడ్డీ గ్యాంగ్. బీరువాలోని నగలు, నగదుతో పరారైంది. బీరువాలోని బట్టలు కిందపడేసి నగలు నగదు మాత్రమే చోరీ చేసింది చెడ్డీ గ్యాంగ్. బనియన్లు, డ్రాయర్లు ధరించి మారణాయుదాలతో ఇళ్లల్లోకి చెడ్డీ గ్యాంగ్ ఎలా ఎంట్రీ ఇచ్చిందో సీసీ కెమెరా లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
వీడియో చూడండి..
ఈ తరహా దొంగతనాలకు పాల్పడేది చెడ్డి గ్యాంగ్ అని భావిస్తున్న పోలీసులు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీతో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పరారీలో ఉన్న దొంగల ముఠా కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





