March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Road Accident: మరో అరగంటలో పండంటి బిడ్డతో కోడలు అత్తారింటికి.. అంతలోనే విషాదం



Road Accident: వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న బాలింత సరస్వతి మూడు నెలల చిన్నారి విద్య శ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. సరస్వతి అక్క చెల్లెలు అయిన నీలమ్మ, యోగేశ్వరి ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపల చనిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి..


డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళిన కోడలు.. పండంటి బిడ్డతో మరో అరగంటలో తమ ఇంట్లో అడుగుపెడుతుందని ఎదురుచూస్తున్నారు అత్తింటివారు. కానీ అంతలోనే అనుకోని విషాద వార్త వినాల్సి వచ్చింది. బిడ్డను తీసుకొని తొలిసారి అత్తింటికి వస్తున్న సందర్భంలో.. హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి అని అనుకుంటున్న తరుణంలో.. కారు రూపంలో వచ్చిన మృత్యువు తల్లి.. మూడు నెలల చిన్నారిని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా రాయంపల్లికి చెందిన సరస్వతి.. డెలివరీ కోసం పుట్టిల్లు మార్తాడు వచ్చింది. రెండవ కాన్పు అయిన సరస్వతికి ఆడబిడ్డ జన్మించింది. మూడు నెలల తర్వాత పుట్టింట్లో వడి బియ్యం తీసుకుని బాలింత సరస్వతి.. చిన్నారి విద్య శ్రీ తో పాటు తన అక్కా, చెల్లెలు అయిన నీలమ్మ, యోగేశ్వరితో అత్తారింటికి ఆటోలో బయలుదేరింది. మరో అరగంటలో సరస్వతి మూడు నెలల చిన్నారిని తీసుకుని అత్తారింట్లోకి అడుగుపెడుతున్న సంతోషం..కాస్తా ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. కూడేరు మండలం కమ్మూరు వద్ద అక్క, చెల్లెల్లు సరస్వతి, నీలమ్మ, యోగేశ్వరి ప్రయాణిస్తున్న ఆటోను బళ్లారి వైపు నుండి అనంతపురం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది.


వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న బాలింత సరస్వతి మూడు నెలల చిన్నారి విద్య శ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. సరస్వతి అక్క చెల్లెలు అయిన నీలమ్మ, యోగేశ్వరి ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపల చనిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తల్లి పొత్తిళ్ళలో ఉన్న చిన్నారితోపాటు.. తల్లి సరస్వతి మృతి చెందడం.. స్థానికంగా ఉన్న వారందరినీ కలచివేసింది.

ఇలా ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు.. మూడు నెలల చిన్నారి మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో అరగంటలో పండంటి బిడ్డతో బాలింత సరస్వతి ఇంటికి చేరుకుంటుంది అనగా.. కారు రూపంలో మృత్యువు కబళించింది.

Also read

Related posts

Share via