July 1, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Watch Video: పెళ్లిలో పురోహితుడికి అవమానం.. ఖండించిన పలు సంఘాల నేతలు..

కాకినాడ జిల్లా మూలపేట గ్రామంలో ఒక సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం మండలం మూలపేట గ్రామంలో గ్రామ పురోహితునిగా తన వృత్తిని నిర్వహిస్తున్నారు ఆచెళ్లా సూర్యనారాయణ మూర్తి శర్మ. ఏప్రిల్ 12న వివాహం నిమిత్తం నాగమణి అనే మహిళ కుమారుడి పెళ్ళికి పురోహితునిగా వెళ్లాడు. పెళ్లి తంతు జరుగుతున్న క్రమంలో అక్కడ ఆకతాయిలు కొంతమంది ఆ పురోహితుడు మీద విచక్షణారహితంగా, కించపరిచే విధంగా అక్కడున్న వస్తువులతో దాడికి పాల్పడ్డారు. పెళ్లి జరుగుతున్న క్రమంలో పురోహితుడు మీద పసుపు, కుంకుంమ వేసి అసౌకర్యానికి గురిచేశారు. అలాగే కళ్యాణ వేదికపై ఉన్న వస్తువులు చిందర వదరగా పడేసి అతన్ని అవమానానికి గురి చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్న వీడియోగ్రాఫర్ డిపి క్రియేషన్ షూట్ చేసి పురోహితున్ని అవమానిస్తూ పెళ్లి చేసే బ్రాహ్మణుని వీడియోకి సాంగ్ పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో రాష్ట్రమంతా వైరల్‎గా మారింది.



ఈ సంఘటన తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, జయ హనుమాన్ సేవా సమితి, పిఠాపురం పలు హిందూ సేవా సంఘాలు, బ్రాహ్మణ సేవా సంఘాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో బాధిత పురోహితుడని పిఠాపురం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు, జై హనుమాన్ సేవాసమితి అధ్యక్షులు సురేంద్ర దత్త, బ్రాహ్మణ సభ్యులు విజయ జనార్ధనాచార్యులు, చెరుకుపల్లి శ్రీరామ్మోహన్ ఆనందు తదితరులు పురోహితుని పరామర్శించారు. ఈ ఘటనపై పెళ్లి జరిగిన ఇంటికి వెళ్లి ఆరాతీశారు. ఇలాంటి ఆకతాయి చేష్టలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. పెళ్లి జరిగిన వారి బంధువుల ఇంటికి వెళ్లి ఆకతాయిల వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ స్పందిస్తూ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.



Also read

Related posts

Share via