March 15, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. చడిచప్పుడు లేకండా చిటికెలో మాయం చేశారు.. !



పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడుకు చెందిన యనమల ఎడ్వర్డ్ మేకలు, గొర్రెలు పెంచుకుని జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామంలోని ఇంటికి సమీపంలోనే ఒక దొడ్డి ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో వాటిని అక్కడ ఉంచుతాడు. అయితే శనివారం(ఫిబ్రవరి 1) తెల్లవారుజామున లేచిన ఎడ్వర్డ్, తన దొడ్డి వద్దకు వెళ్లిచూడగా కొన్ని గొర్రెలు కనిపించకుందాపోయాయి.


బర్డ్ ప్లూ భయంతో చికెన్ అమ్మకాలు మందగించాయి. బర్డ్ ప్లూ భయం లేదని చాటడానికి అనేక చోట్ల చికెన్ మేళాలు పెడుతున్నారు. అయినప్పటికీ చికెన్ అమ్మకాలు ఇంకా సాధారణ స్థాయికి రావడం లేదు. మరోవైపు చికెన్ అమ్మకాలు మందగించడంతో మటన్ కు డిమాండ్ పెరిగింది. గతం కంటే అధికంగా మటన్ అమ్మకాలు కొనసాగుతన్నాయి. అయితే మాములుగా కొనుక్కొని వండుకొని తింటే ఏముంటుందనుకున్నారో ఏమో ఆ దొంగలు… ఏకంగా వాటినే దొంగలించారు. అది కూడా సరికొత్త పద్దతిని ఎంచుకుని మరి ఎత్తుకుపోయారు.


పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడుకు చెందిన యనమల ఎడ్వర్డ్ మేకలు, గొర్రెలు పెంచుకుని జీవనం సాగిస్తున్నాడు. తన గ్రామంలోని ఇంటికి సమీపంలోనే ఒక దొడ్డి ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో వాటిని అక్కడ ఉంచుతాడు. అయితే శనివారం(ఫిబ్రవరి 1) తెల్లవారుజామున లేచిన ఎడ్వర్డ్, తన దొడ్డి వద్దకు వెళ్లిచూడగా కొన్ని గొర్రెలు కనిపించకుందాపోయాయి. దీంతో అవాక్కైన గొర్రెల యజమాని వెంటనే ఏమై ఉంటుందోనని ఆలోచించడం మొదలు పెట్టాడు. దొడ్డి చుట్టూ ఉన్న కంచెను తొలగించడంతో ఇది దొంగల పనే అని అర్ధం అయింది.

అయితే గొర్రెలు అరవకుండా ఎలా దొంగలించి ఉంటారో అర్ధం కాలేదు. దీంతో వెంటనే గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో మసీదు వద్ద ఉన్న సీసీ కెమెరాలో కారు నిలిపి అందులో గొర్రెలను సరిచేస్తున్న విజువల్స్ కనిపించాయి. దీంతో దొంగలు తమ గొర్రెలను అపహరించి అవి అరవకుండా తెలివిగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు అర్ధమైంది. దీంతో ఎడ్వర్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు లక్షన్నర విలువ చేసే గొర్రెలు, మేకలు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు వివిద సీసీ కెమెరా విజువల్స్ సాయంతో దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మటన్ ధరలు పెరగడంతో దొంగలు వాటిని అపహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అదివారం మార్కెట్ లో ఎవరికి అనుమానం రాకుండా అమ్మి ఉంటారన్న అనుమానిస్తున్నారు. మరి పోలీసులు అసలు దొంగలన్ని పట్టుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది..!

Also read

Related posts

Share via