July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Fake IT Job Offers: వామ్మో.. కాంబోడియాలో ఉద్యోగాలంటూ వల.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఇదో ఘరానా మోసం.. నిరుద్యోగులే టార్గెట్.. అమాయకులకు కాంబోడియాలో ఉద్యోగం పేరుతో వల వేసి, అక్కడకు వెళ్ళాక పాస్ పోర్ట్, వీసాలు తీసేసుకుంటారు. ఏడాది పాటు బలవంతంగా ఇండియాలోనే ఆర్థిక నేరాలు చేయిస్తున్న ముఠా దారుణాలు వెలుగు చూశాయి. పక్కా సమాచారంతో విశాఖ పోలీసులు ఈ ముఠాకు చెక్ పెట్టారు.


ఉద్యోగం పేరుతో కాంబోడియాకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ చేత మొబైల్ కాల్స్ ద్వారా రకరకాల సైబర్ నేరాలు చేయిస్తోంది ముఠా. ఇందుకోసం డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 150 మంది యువకులను కంబోడియాకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. వారితో మోసాలు చేయిస్తున్న గ్యాంగ్‌ను విశాఖ పోలీసులు గుర్తించారు. వారితో బలవంతంగా ఫెడ్ ఏక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలను చేయిస్తున్నట్టు నిర్దారించారు. నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరుకు వసూలు చేసి కంబోడియాకు పంపుతున్నట్లు గుర్తించారు.

కంబోడియా నుంచి ఈ మాఫీయా దగ్గర నుంచి తప్పించుకు వచ్చిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖలో కేసు నమోదు అయింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. కంబోడియాలోని భారత విదేశాంగ శాఖ అధికారులను కూడా అలెర్ట్ చేశారు. ఈ రాకెట్ వెనుక చైనాకు చెందిన కొందరు కేటుగాళ్ళు ఉన్నట్టు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు.


రకరకాల సైబర్ నేరాలు

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో వివిధ రకాల ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్నారు. బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురి చేసి వారి బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను, వారి వ్యక్తిగత వివరాలను కొల్లగొడుతూ, దోచుకున్న డబ్బులను ఇతర దేశాలకు దాటించేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫెడ్ ఎక్స్, TRAI పేరు మీద అనేక మోసాలు చేస్తున్న వైనం బహిర్గతమైంది.

FedEx Courier పేరుతో మోసాలు..

FedEx Courier పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్ళు. ఫేక్ ఫోన్ నంబర్స్ తో మనకి ఫోన్ చేసి FedEx లో మీ పేరు మీద కొరియర్ బుక్ అయింది అని, అందులో వివిధ రకాల అసాంఘీక కార్యకలాపాలకు సంబంధించిన వస్తువులు వున్నాయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని నుంచి తప్పుకునేందుకు వారి చెప్పిన అక్కౌంట్స్ లో డబ్బులు వేయించుకుని మోసం చేస్తున్నారు.

TRAI పేరుతో మోసం

ఈ నేర విధానాన్ని ఇంకొంచెం మార్చి TRAI (టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) పేరుతో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఫేక్ ఫోన్ నంబర్స్‌తో ఫోన్ చేసి TRAI నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరు, ఆధార్ మీద ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయి ఉందని నమ్మిస్తున్నారు. అది ముంబైలో ఉన్న వ్యక్తి వాడుతున్నారు. దానితో వివిధ 5 నేరాలకు పాల్పడ్డట్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి చెప్పిన అక్కౌంట్స్ లో డబ్బులు వేయించుకుని మోసం చేస్తున్నారు.

మోసాలు జరుగుతున్న వైనాన్ని వివరించిన విశాఖ సీపీ

మొదటగా బాధితుడికి ఒక తెలియని ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. అది లిఫ్ట్ చేసిన తరువాత FedEx Courier నుంచి ఫోన్ చెస్తున్నామని, చెప్పి మీ పేరు మీద ఒక పార్సెల్ ముంబై నుండి తైవాన్ వెళుతుండగా ముంబై ఎయిర్పోర్ట్ లో కస్టమ్ అధికారులు పట్టుకున్నారు. అందులో అక్రమ రవాణా వస్తువులు అయిన 5 ఫేక్ పాస్ పోర్ట్స్, 3 క్రేడిట్ కార్డ్స్, 200 గ్రాముల MDMA పౌడర్(Synthatic Drugs), 3500 రూపాయల క్యాష్ ఉందనీ, దానిని కస్టమ్స్ అధికారులు ముంబై క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించారని నమ్మబలుకుతారు. మెల్లగా బాధితులను ముగ్గులోకి దింపి అందిన కాడికీ దండుకుంటారని విశాఖ సీపీ వివరించారు. సైబర్ నేరగళ్లు Open Source Intelligence పరికరాళ్ళతో బాధితుడు వివరాలు కలెక్ట్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.

ఆ తరువాత ముంబై క్రైమ్ బ్రాంచ్ వారికి లైన్ కలుపుతున్నామనీ నమ్మబలికి, బాధితుడు పేరు వివరాలు చెప్పగానే fraudster మీ పేరు మీద ఉన్న నెంబర్ తో చాలా నేరపూరిత కార్యకలాపాల గురుంచి చెప్పి, దీని మీద FIR రిజిస్టర్ చేయాల్సి ఉందని బెదిరిస్తారు. ఇతర వివరాల కోసం ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడమని ఫోన్ వేరేవాళ్ళకి ఇస్తారనీ వివరించారు సీపీ. తరువాత ఇంకో fraudster పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నట్టు నటించి, వెంటనే ముంబాయి క్రైమ్ పోలీస్ స్టేషన్ కు రావాలని చెబుతారు.

బాధితుడు వేరే లొకేషన్ లో ఉన్నానని చెప్పగా, whatsapp/skype ద్వారా కనెక్ట్ చేసి, అడిగిన ప్రస్నలన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్పాలని, ఒంటరిగా ఉండాలి ఎవరు మీ దగ్గరలో ఉండకుడదంటూ ఇన్వెస్టిగేషన్ కు సపోర్ట్ చేయాలని, లేదంటే మీరు మీ ఫ్యామిలీ అంతటిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని భయపెడతారని వివరించారు పోలీస్ కమిషనర్. మీరు చెప్పినది అంత వీడియో రికార్డు అవుతుందనీ, సీనియర్ ఆఫీసర్స్ అది చూస్తారని నమ్మించే ప్రయత్నం చేస్తారు. చివరికి కేసు నుంచి తప్పించేందుకు లక్షల్లో సొమ్మును దోచేస్తున్నారు కేటుగాళ్లు.

సైబర్ మోసగాళ్ళ చేతిలో డబ్బులు వేసి మోసపోతున్న బాధితులు

ఇలాంటి కేసులో గతంలో సకాలంలో 1930 హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయడం ద్వారా పోగొట్టుకున్న డబ్బులలో రూ.85,70,923 ను వసూలు చేయడం జరిగిందన్నారు విశాఖ సీపీ. నగరానికి చెందిన లాజిస్టిక్స్ వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్త తేదీ 20 ఏప్రిల్ రోజున fedes కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పది రూ. రూ. 1.30 కోట్లు సోగొట్టుకున్నారని సీపీ వివరించారు. సకాలంలో 1930 కాల్ సెంటర్ కి కాల్ చేసే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ వివరాలు నమోదు చేయగా పోగొట్టుకున్న డబ్బులలో రూ. 85.22 లక్షలు హోల్డ్ చేయగలిగామన్నారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులు పొగొట్టుకున్నట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి, రిపోర్ట్ చేయడం ద్వారా పోగొట్టుకున్న డబ్బులని తిరిగి తెచ్చుకోవచ్చన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్. ఈ సంవత్సరంలో Fodles Courter మోసం పై 12 కేసులు రిజిస్టర్ అయ్యాయన్నారు.

Also read

Related posts

Share via