సింహాద్రిపురం దగ్గర స్కూటీపై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మాస్క్ వేసుకుని వచ్చి తనను కత్తితో పొడిచారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.
ప్రశాంతతకు మారుపేరైన విశాఖ నగరంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. వినాయక చవితి నిమజ్జనోత్సవంలో పాల్గొన్న కార్పెంటర్‌ను నడి రోడ్డుపైనే హత్య చేసిన ఘటన మరువక ముందే.. స్కూటీపై వెళ్తున్న మహిళను వెంబడించి మరీ హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు. స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్న ఆ మహిళ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది.
విశాఖ హెచ్‌బీ కాలనీలో పట్టపగలు కలకలం రేగింది. వివాహితపై దుండగులు కత్తితో దాడి చేశారు. మహిళ స్కూటీపై వెళ్తుండగా నడిరోడ్డు పై ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో తప్పించుకున్న మహిళ స్థానికులకు సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మహిళకు నడుము భాగంలో గాయమైన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. స్కూటీపై వెళ్తుండగా దాడి చేసిన్నట్టు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది ఆ బాధితురాలు.
ఇద్దరూ దుండగులు మాస్కులు వేసుకుని వచ్చి ఎటాక్ చేసినట్టు బాధితులు పోలీసులకు తెలిపింది. బాధితురాలి భర్త వస్త్ర వ్యాపారి. ముంబైకి వెళ్ళాడు. అతను లేని సమయంలో దుండగులు ఆమెపై దాడికి తెగబడ్డారు. కాగా, ఈ ఘటనకు సంంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకొన్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025