ఒంటరిగా ఉన్న వృద్దురాళ్ళను మంజు అనే వ్యక్తి టార్గెట్‌గా చేసుకుని మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి కూడా సేవిస్తుంటాడని చెప్పుకొచ్చారు. తమ ప్రాంతంలో మరికొంత మంది వృద్ధురాళ్ళపై అత్యాచారాలు జరిగాయని, అయితే పరువు పోతుందన్న భావనతో మరికొంతమంది బయటకు చెప్పుకోవటం లేదని స్థానికులు తెలిపారు.
ఆమె పేరు రమణమ్మ.. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆలయంలో పని చేస్తుంది. ఒంటరిగా జీవిస్తోంది. అయితే రెండు రోజుల క్రితం ఆమె చనిపోయినట్లు గుర్తించారు. మెడ మీద గాట్లు ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు భావించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రమణమ్మ ఇంటికి సమీపంలో ఉన్న మంజు అతని స్నేహితుడు సాంబను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తేదిన బెయిల్‌పై విడుదలైన మంజు వెంటనే రమణమ్మపై అత్యాచారం చేసి హత్య చేయడం కలకలం రేపింది. పోలీస్ విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి.
మద్యానికి బానిసైన మంజు మద్యం మత్తులో ఏం చేయడానికి వెనుకాడడని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఒంటరిగా ఉండే వృద్దురాళ్ళు ప్రతిఘటించలేరనే ఉద్దేశంతోనే వారిపై దాడులు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది మార్చిలో 85 ఏళ్ళ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మంజును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఫిబ్రవరి 1న బెయిల్ పై విడుదలైన మంజు వెంటనే రమణమ్మపై దాడి చేసి హత్య చేయడం కలకలం రేపింది. మంజుపై 2023లో కూడా వృద్ధురాలి అత్యాచారం హత్య కేసు నమోదైంది. 85 ఏళ్ళ వృద్ధురాలి పై 2023లో అత్యాచారం చేయగా ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.
మంజు ఒంటరిగా ఉన్న వృద్దురాళ్ళను టార్గెట్‌గా చేసుకుని మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి కూడా సేవిస్తుంటాడని చెప్పుకొచ్చారు. తమ ప్రాంతంలో మరికొంత మంది వృద్ధురాళ్ళపై అత్యాచారాలు జరిగాయని, అయితే పరువు పోతుందన్న భావనతో మరికొంతమంది బయటకు చెప్పుకోవటం లేదని స్థానికులు తెలిపారు. మంజును అరెస్ట్ చేయడమే కాకుండా కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మంజు తోపాటు అతని స్నేహితుడు సాంబను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also read
- ఈ రెండు గ్రహాలతో అరుదైన యోగం.. వీరికి ఆర్థిక లాభాలు, ఊహించని ప్రయోజనాలు
- శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన ఇసుక శివలింగం.. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎక్కడో కాదు హైదరాబాద్కు దగ్గర్లోనే
- శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ల కూడదా? ఎందుకో తెలుసా?
- Andhra News: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన కారు.. చేజింగ్ చేసి తనిఖీ చేయగా..
- Andhra Pradesh: కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిపై పగపెంచుకున్న ఓ తండ్రి.. ఏం చేశాడో తెలుసా..?