బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో యజమాని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతోనే వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దానితో పాటు మరో రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురంలోని రావులచెరువు వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాణసంచా తయారు చేస్తున్న ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిసర ప్రాంతాల్లోని మరికొందరు కూడా గాయపడినట్టుగా తెలిసింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. గాయపడిన వారందరినీ అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం కిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు పరామర్శించారు.
బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో యజమాని ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతోనే వారు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. దానితో పాటు మరో రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంట్లో దీపావళి మందు గుండు సామాగ్రి తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.
పేలుడు ధాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యామని స్థానికులు చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కృష్ణారావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.. ధ్వంసమైన భవనం శిథిలాలను ప్రొక్లెయిన్ సాయంతో తొలగించారు
Also read
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?
- చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
- Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..





