మొన్న గుడ్లవల్లేరులో ఏం జరిగిందో..నిన్న హైదరాబాద్‌లోనూ అదే జరిగింది. ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలోనే అదే రిపీట్ అయింది. మరి ఈ సారైనా..ఆ కెమెరా వెనుక ఉన్న కన్ను ఎవరిదో తెలుస్తోందా..? లేక ఆ రెండు కథల్లాగే..ఈ మూడో కథ కూడా ఎటూ తెలకుండా ముగుస్తుందా..? అసలేంటి ఈ కన్‌ఫ్యూజన్ అనుకుంటాన్నారా..! లెట్స్ వాచ్ ఇట్..
తమ హాస్టల్‌లోని వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయంటూ..గత ఏడాది ఆగష్టు 28న ఆందోళనకు దిగారు.. కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు. ఏపీవ్యాప్తంగా కలకలం రేపింది ఈ వ్యవహారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..హాస్టల్‌ను పరిశీలించారు. నిందితులను గుర్తించి..కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అటు ప్రజా ప్రతినిధులు సైతం..దోషులను వదిలిపెట్టేది లేదంటూ ప్రకటనలు గుప్పించారు. అయితే ఘటన జరిగి ఆరు నెలలు దాటినా ఇంతవరకూ నిందితులను గుర్తించలేదు.
ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన మరవకముందే.. హైదరాబాద్ శివార్లలోని సీఎంఆర్ కాలేజ్ హాస్టల్‌లోనూ అదే తరహా ఘటన వెలుగుచూసింది. తమ వాష్‌రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ గత నెల 2వ తేదీన ఆందోళనకు దిగారు..విద్యార్థినులు. హాస్టల్‌లో పనిచేస్తున్న కొంతమంది మేల్‌వర్కర్స్.. బాత్‌రూమ్ వీడియోలను రికార్డు చేశారన్నది విద్యార్థినుల ఆరోపణ. బాత్‌రూమ్ వెంటిలేటర్‌పై ఉన్న చేతి గుర్తులే అందుకు సాక్ష్యంగా చూపించారు..స్టూడెంట్స్. దీంతో కాలేజ్‌ను పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు..పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్లకు కూడా స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇష్యూ జరిగి నెలన్నర దాటినా.. నిందితులు ఎవరో ఇంతవరకూ తేల్చలేదు.
క్యాంపస్‌లోకి చొరబడ్డ ఓ అగంతకుడు ఉమెన్స్ హాస్టల్ బాత్‌రూమ్‌ల్లోకి తొంగిచూస్తూ వీడియో తీశాడంటూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.. వర్సిటీలో ఇదే మొదటి సారి కాదని..గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా వీసీ పట్టించుకోవడం లేదంటూ నిరసన చేపట్టారు.
విద్యార్థినుల ఆందోళనలతో స్పందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా విచారణ చేపట్టారు. యూనివర్సిటీ వీసీతో పాటు సిబ్బంది, విద్యార్థినులతో సమావేశమై జరిగిన ఘటనపై ఆరా తీశారు. వ్యవహారంపై పోలీస్ విచారణ చేపట్టామన్న కలెక్టర్.. ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపిస్తామన్నారు. అలాగే విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
గతంలో లాడ్జ్‌లు..మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్‌లో కనిపించిన హిడెన్ కెమెరాలు..ఇప్పుడు కాలేజీల్లోని లేడీస్ వాష్‌రూముల్లోకి చొరబడుతున్నాయి. బాత్‌రూమ్‌ల వెనుక నక్కుతున్న కొంతమంది బద్మాష్‌గాళ్లు.. విద్యార్థినిల దృశ్యాలను సీక్రెట్‌గా షూట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండడంతో..అటు విద్యార్థినులు, ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి వారిలో భరోసా నింపాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి
Also read
- ఈ రాశుల వారికి జాక్‌పాట్..! వీరికి వందేళ్ల అదృష్టం పట్టుకున్నట్లే..! జీవితమే మారిపోతుంది..!
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు