మనుషులా.. మృగాలా.. ఇద్దరు చిన్నారులపై విచక్షణా రహితంగా దాడిని చూస్తే ఈ పదం చాలా చిన్నది అనిపిస్తుంది. మద్యం మత్తులో సోయి మరిచి చిన్నారిని చితకబాదాడు ఓ మారు తండ్రి. కొట్టడమే కాదు.. గాయాలపై పచ్చిమిర్చికారం చల్లి పైశాచిక ఆనందం పొందే వ్యక్తిని మానవ మృగం అనడంలో తప్పేం లేదు అనిపిస్తుంది.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలపై మారు తండ్రి విచక్షణా రహితంగా దాడి చేశాడు. చిత్రహింసలకు గురిచేశాడు. చార్జర్ వైర్‌తో కుమారుడు రాహుల్‌పై చితకబాదాడు.
బాలుడి తల్లి శారద గత ఏడాదిగా పవన్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. పదేళ్ల క్రితం గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శారద గొడవల కారణంగా మూడేళ్ల క్రితం విడిపోయింది. ఈ క్రమంలో కామవరపుకోటకు చెందిన పవన్‌తో తన ఇద్దరి పిల్లలతో కలిసి సహజీవనం చేస్తుంది శారద. అల్లరి చేస్తున్నారనే నెపంతో పిల్లలు ఉదయ్ రాహుల్, రేణుకను కొంతకాలంగా చిత్రహింసలు పెడుతున్నాడు పవన్. రాత్రి మద్యం మత్తులో బాలుడు రాహుల్ పై మరోసారి ఛార్జర్ వైర్‌తో దాడి చేశాడు. విషయం తెలిసి స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చిన్నారులు ఉదయ్ రాహుల్, రేణుక. కొంతకాలంగా మారుతండ్రి తమను కొడుతున్నాడని బాలుడు రాహుల్ చెప్తున్నాడు
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





