ఓ వ్యక్తి జైలులో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చాడు. అది కూడా స్వామి మాలలో తెచ్చాడు. ఎవరికి అనుమానం రాదని అనుకున్నాడు. కానీ పోలీస్ సిబ్బందికి అనుమానమొచ్చి తనిఖీ చేయగా.. ఆ వివరాలు..
విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి కలకలం రేపింది. గంజాయితో దొరికిపోయాడు ఉద్యోగి కడియం శ్రీనివాసరావు. జైలులో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్న కడియం శ్రీను. టిఫిన్ బాక్స్‌లో పెట్టుకుని జైలుకు తీసుకెళ్తూ పట్టుబడిపోయాడు. జైలు అధికారుల తనిఖీలలో ఈ విషయం వెలుగు చూసింది. జైలులో పని చేస్తున్న సిబ్బంది ఇలా గంజాయి తరలిస్తుండడంతో అధికారులు అవాక్ అయ్యారు. 95 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్న అధికారులు.. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అరిలోవ పోలీసులు.. కడియం శ్రీనును అరెస్టు చేశారు.
స్వామి మాలలో ఉండగా..
జైల్లో ఉన్న ఖైదీల కోసం గంజాయి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు పోలీసులు. గత ఏడాదిన్నరగా జైల్లో పని చేస్తున్నాడు కడియం శ్రీనివాసరావు. డిప్యూటేషన్‌పై జైల్లో విధుల కోసం వచ్చాడు. స్వామి మాలధారణలో ఉంటూ అనుమానం రాకుండా జైల్లోకి గంజాయి సప్లై చేస్తూ దొరికిపోయాడు.
వాడి కోసమే ఆ పని..
అసలు ఆ గంజాయి ఎవరికోసం తీసుకెళ్తున్నాడనేది ఆరా తీస్తే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీషీటర్ గుర్రాల సాయి కోసం గంజాయి సప్లయర్ అవతారం ఎత్తాడు ఈ ఫార్మసిస్ట్. గత కొన్ని నెలలుగా గుట్టుగా ఈ వ్యవహారం సాగిపోతుందని అంటున్నారు పోలీసులు. కడియం శ్రీనివాసరావుతో జైల్లోకి పంపేందుకు గంజాయిని సప్లై చేస్తున్న వారిని పట్టుకుంటామని అంటున్నారు ఆరిలో సీఐ మల్లేశ్వరరావు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





