April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Srisailam: పవిత్ర శ్రీశైలం ఆలయంలో ఇంటి దొంగల చేతివాటం.. 8 మంది సిబ్బంది పై సస్పెన్షన్‌ వేటు

శ్రీశైల దేవస్థానం టోల్గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న 8 మంది సిబ్బందిపై ఆలయ ఈవో సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆలయ ఆకస్మిక తనిఖీల్లో సిబ్బంది వద్ద అదనపు డబ్బును గుర్తించిన అధికారులు ఈ మేరకు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. విచారణ జరిపి ఈవోకు నివేదిక అందించడంతో ఎనిమిది మందిపై ఆలయ ఈవో శ్రీనివాసరావు సస్పెన్షన్‌ వేటు వేశారు


నంద్యాల, జనవరి 14: నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో టోల్గేట్‌లో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులపై వేటు పడింది. శ్రీశైలం టోల్గేట్ విధులు నిర్వహిస్తున్న 8 మంది సిబ్బందిని అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టోల్ గేట్ లో ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంకు వచ్చే ప్రతి వాహనం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన టోల్గేట్ వద్ద వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తారు. అయితే దేవస్థానం అధికారులు ఈనెల 5 తేదీన ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సిబ్బంది దగ్గర ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా డబ్బు ఉన్నట్లు గుర్తించారు. టోల్‌గేట్ సిబ్బంది వద్ద అదనంగా రుసుము ఉండడంతో విచారణ చేపట్టారు.


టోల్గేట్ లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి ఎం రామకృష్ణుడుతోపాటు కాంట్రాక్టు సిబ్బంది బి నాగ పరమేశ్వరుడు, జి మల్లికార్జున రెడ్డి, ఎన్ గోవిందు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మల్లికార్జున రెడ్డి, బీఆర్‌ మల్లేశ్వర్ రెడ్డి, డైలీ వేజ్ సిబ్బంది టోల్గేట్ ఇంచార్జ్ అధికారి శ్రీనివాసరావులపై నివేదిక తయారుచేసిన అధికారులు.. దానిని ఆలయ ఈవో శ్రీనివాసరావుకు అందజేశారు. ఈవో శ్రీనివాసరావు నివేదికను పరిశీలించి 8 మందిని వీధుల నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేశా. వారి స్థానంలో ఇతర సిబ్బందిని టోల్గేట్‌లో నియమించారు

Also read

Related posts

Share via