మృత్యువు ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో వస్తాదో చెప్పలేం.అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో ఇది చెప్పటం ఇంకా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే చిన్నారులకు ఆపదల పట్ల ఎటువంటి అవగాహన గాని, అనుభవం ఉండదు. ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో ఏదైనా ప్రమాదం బారినపడిన ఎలా బయటపడాలో కూడా వారికి తెలియదు. అందుకనే పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారిని సంరక్షించు కోవాలనీ సూచిస్తూ ఉంటారు నిపుణులు. చిన్నారుల విషయంలో ఒక్కోసారి తల్లిదండ్రులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం వారి ప్రాణాల మీదకు తీసుకువస్తుంది. అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేట గ్రామంలో విషాదం నెలకొంది. గొంతులో చెకోడి అడ్డంపడి కిల్లారి సోనాక్షిత అనే రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పాప ఏడుస్తుందని తల్లి శ్రీదేవి తినడానికి పాపకి చెకోడి ఇచ్చి తన పనుల్లో నిమగ్నమైంది. అయితే చెకోడి తింటున్న క్రమంలో ఒక్కసారిగా అది గొంతు వద్ద అడ్డం పడి చిన్నారి ఉక్కిరిబిక్కిరి అయింది. పాప పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు గొంతులో చేకొడి అడ్డం పడిందని గ్రహించి వెంటనే కొండములగాం ప్రభుత్వాసుపత్రికి తరలించే యత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు సోనాక్షిత మార్గమధ్యంలోనే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె కల్ల ముందే ఉక్కిరిబిక్కిరై మృతి చెందటంతో తల్లిదండ్రులు ఈశ్వరరావు, శ్రీదేవి, బందువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల ముందే చిన్నారి నరకయాతన పడుతూ ఉంటే తాము ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామంటూ వారు కుమిలి పోతున్నారు.
గొంతు వద్ద చేగోడి అడ్డుపడి చిన్నారి మృతి చెందిన ఘటన అందరినీ కలిచి వేస్తోంది. ముఖ్యంగా చిన్నారులు ఉన్న ప్రతి తల్లిదండ్రులను ఈ ఘటన ఉలిక్కిపడేలా చేస్తోంది. చిన్నారుల సంరక్షణ విసయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత జాగ్రత్త వహించాలి అన్నది సూచిస్తోంది ఈ సంఘటన
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025