February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: పండగ సరదా తీరని శోకం.. కడలి మింగేసింది..!

పండుగ పూట తీవ్ర విషాదం.. సరదాగా విహారానికి వచ్చిన ఓ కుటుంబంలో ఓ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. సముద్రంలో సరదాగా ఆడుకుంటుండగా బాలుడు గల్లంతయ్యాడు.. అతన్ని రక్షించేందుకు వెళ్ళిన మరో యువకుడు కూడా కెరటాల్లో కొట్టుకుపోయాడు. కాసేపటికి బాలుడు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన కొనఊపిరితో ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాల కోల్పోయాడు. మరో యువకుడు ప్రాణాల కోల్పోయి ఒడ్డున తేలాడు. అనకాపల్లి జిల్లా రేవు పోలవరం బీచ్ లో ఈ ఘటన జరిగింది.


సంక్రాంతి పండగల అందరూ సరదాగా గడుపుకుంటున్నారు. ఊరుల సంక్రాంతి సందడే సందడిగా ఉంది. మరి కొంతమంది విహారాల్లో బిజీ బిజీగా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల.. కాకినాడ జిల్లా తుని మండలానికి  చెందిన ఓ ఉమ్మడి కుటుంబం విహారానికి బయలుదేరింది. రాంబాబు కుటుంబానికి చెందిన 30 మంది కనుమ పండుగ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా అంతా కలిసి గడిపారు. ఈ క్రమంలో.. కెరటాల్లో సాత్విక్ అనే పదేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో మణికంఠ అనే మరో యువకుడు గల్లంతయయాడు . అందరూ గుండెల్లో పట్టుకున్నారు కేకలు వేశారు. అయినా ఏ మాత్రం ఫలితం దక్కలేదు. కాసేపటికి కెరటాల ధాటికి సాత్విక్ ఒడ్డుకు కొట్టుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న సాత్వికను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు సాత్విక్. దీంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు రాంబాబు కుటుంబం.

మరోవైపు మణికంఠ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే మణికంఠ కోసం వేచి చూసిన ఆ కుటుంబానికి మళ్లీ కన్నీరే మిగిలింది. నక్కపల్లి మండలం చిన తినార్ల ఒడ్డుకి మణికంఠ మృతదేహం కొట్టుకొచ్చింది. దీంతో ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది

Also read

Related posts

Share via