SGSTV NEWS
CrimeNational

పాట్నా NITలో తెలుగు విద్యార్ధిని సూసైడ్‌.. విద్యార్ధుల ఆందోళన

పాట్నాలో లోని NITలో తెలుగు విద్యార్ధి పల్లవిరెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌ గదిలో పల్లవి ఉరివేసుకొని సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


బిహార్‌ రాజధాని పాట్నాలోని NITలో తెలుగు విద్యార్ధిని సూసైడ్‌ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బిటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న పల్లవిరెడ్డి హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు అధికారులు వెల్లడించారు. మానసిక ఒత్తిడి తోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందిని అధికారులు చెబుతుంటే .. విద్యార్ధులు మాత్రం ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్ధులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. క్లాస్‌లు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హాస్టల్‌ నుంచి బయటకు రావద్దని తమను అధికారులు ఆదేశించారని విద్యార్దులు తెలిపారు. క్యాంపస్‌లో ఏం జరుగుతుందో తెలియడం లేదని మండిపడ్డారు. హాస్టల్‌లో సరైన వసతులు లేవని ఆరోపిస్తున్నారు. కాగా పల్లవిరెడ్డి స్వస్థలం ఏపీలోని అనంతపురం.. మృతదేహాన్ని దానాపూర్‌ ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు.


ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే పల్లవి రాసిన సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.. తన చావుకు ఎవరు బాధ్యులు కారని ఆమె లెటర్‌లో రాశారు… తల్లిదండ్రులకు , టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు.. అయితే రోజంతా తమతో నవ్వుతూ మాట్లాడిన పల్లవి ఇలా చేసుకోవడం చాలా బాధ కలిగిచిందంటున్నారు తోటి విద్యార్దులు.. ఈ ఘటన తరువాత పాట్నా ఎన్‌ఐటీ క్యాంపస్‌కు అదనపు బలగాలను తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Also read

Related posts