July 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

పశువుల షెడ్డు నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసిన రైతుకు షాక్..!

ఓ రైతు.. నిత్యం వ్యవసాయంలో బిజీ బిజీ గా ఉంటాడు. అతనికి కొన్ని పశువులు కూడా ఉన్నాయి. పశువులను దానా వేసే.. షెడ్డులోకి వెళ్ళాడు ఆ రైతు. ఎన్నడూ లేని విధంగా ఏదో వింత శబ్దం వినిపిస్తుంది. వెతికితే ఏమీ కనిపించలేదు. దగ్గరకు వెళ్లాలంటే భయం.. అయినా ధైర్యం చేసుకొని ముందుకు వెళ్లాడు. తొంగి చూస్తే.. అమ్మో… అంటూ పరుగులు తీశాడు


అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరి నాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ పశువుల షెడ్డులోకి దూరింది. బుసలు కొడుతూ భయపెట్టింది. శబ్దాలు విన్న రైతు కొండలరావు ఆందోళన చెంది భయంతో వణికిపోయడు.



అనకాపల్లి జిల్లా మాడుగుల మోదకొండమ్మ ఆలయ సమీపంలో 12 అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. కొండలరావు అనే రైతుకు చెందిన పశువుల షెడ్డులో భారీ గిరినాగు కనిపించింది. ఈ 12 అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. షెడ్డులో దూరింది . వింత శబ్దం వస్తుండడంతో కొండలరావు తొంగి చూసేసరికి.. కనిపించింది. అక్కడ నుంచి శబ్దాలు రావడంతో భయబ్రాంతులకు గురైన రైతు.. స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ సమాచారం ఇచచ్చారు. రంగంలో ఒక దిగిన స్నేక్ క్యాచర్.. 12 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also read

Related posts

Share via