SGSTV NEWS
Andhra PradeshCrime

ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య


అనంతపురం: ఊహించని విధంగా పెళ్లి వాయిదా పడటంతో  మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు.

కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. వారం క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో బంధువు ఒకరు చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు.

రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో పెళ్లి ఆగింది. వరుస ఘటనలతో మనస్తాపం చెందిన లక్ష్మీనరసమ్మ తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read

Related posts

Share this