April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !


హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంగళవారం ఆయసంతో ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి వైద్యులు ఎక్స్పైరీ అయిన ఇంజక్షన్‌ను ఇచ్చారు. అది వికటించడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.


హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇంజక్షన్ వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంతకీ అసలేం జరిగిందో తేలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్ బాంజవాడికి చెందిన ఐలయ్య(53) మంగళవారం మధ్యాహ్నం ఆయాసంతో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రింగ్‌రోడ్డు సమీపంలో హైకేర్‌ ఆస్పత్రికి తరలించారు

Man Lost His Life Due To Expired Injection
ఆ తర్వాత వైద్యులు అతడికి పరీక్షలు చేసి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అక్కడున్న వైద్యులు తమ ఆస్పత్రిలో గుండె సంబంధిత వైద్యులు లేరని.. వెంటనే మరో ఆస్పత్రికి తరలించాలని సూచనలు చేశారు. అయితే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అప్పటికే ఐలయ్య మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇలా ఎలా జరిగిందని వైద్యులను నిలదీశారు


చివరికి ఐలయ్యకు ఇచ్చిన ఇంజక్షన్లను పరిశీలించారు. అయితే ఆ ఇంజక్షన్ మార్చి నెలలోనే ఎక్స్పైరీ అయినట్లుగా గుర్తించారు. గడువు ముగిసినప్పటికీ కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఏంటని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్లే ఐలయ్య మృతి చెందాడని వాగ్వాదానికి దిగారు. దీంతో మృతదేహంతోనే ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా ఇలా ఇంజక్షన్‌లు వికటించి రోగులు మృతి చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Also read


Related posts

Share via