నిత్య పెళ్లికొడుకులా మారి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆర్మీ జవాన్ మనీష్ కుమార్‌పై యూపీలోని మేరఠ్‌లో కేసు నమోదైంది. ఆర్మీలో పనిచేస్తున్న అతడు గత పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని హైదరాబాద్‌కు చెందిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దేశ ప్రజలను కాపాడాల్సిన ఓ ఆర్మీ జవాన్ తన బాధ్యతలు మరిచి ప్రవర్తించాడు. నిత్య పెళ్లికొడుకులా వరుస పెళ్లిల్లు చేసుకున్నాడు. ఇద్దరు కాదు ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టే సమయంలో అబార్షన్ చేయించుకోమని తెగ వేధించేవాడు. ఒప్పుకోకపోతే.. అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయేవాడు. ఇదంతా నలుగురి భార్యల్లో ఒక భార్య చెప్పిన విషయాలు. చివరికి అతడ్ని తన భార్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మరి ఆమె ఎలా పట్టుకుంది. ఆ ఆర్మీ జవాన్ ఎలా దొరికాడు అనే విషయానికొస్తే
హైదరాబాద్‌లో పరిచయం
హర్యానాకు చెందిన మనీష్ కుమార్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అతడు గత పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని హైదరాబాద్‌కు చెందిన అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఆర్మీ జవాన్‌పై యూపీలోని మేరఠ్‌లో కేసు నమోదైంది. 2015లో అతడు హైదరాబాద్‌లో పరిచయం అయ్యాడని తెలిపింది.
ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పింది. అయితే మొదట్లో మంచిగానే ఉన్నాడని.. కానీ కొన్ని రోజుల తర్వాత అతడి ప్రవర్తనలో మార్పులు వచ్చాయని పేర్కొంది. అలా తనను ఎప్పటికప్పుడు వేధింపులకు గురిచేసేవాడని చెప్పింది.
అబార్షన్ చేయించుకో
ఒకానొక సమయంలో తాను ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా క్రూరత్వంగా ప్రవర్తించాడని.. అబార్షన్ చేయించుకోవాలని తరచూ ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. అయితే దానికి ఒప్పుకోకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అతడి కోసం వెతుకుతున్న సమయంలో షాకింగ్ విషయాలు తెలిసాయని చెప్పింది.
అప్పటికే మూడు పెళ్లిళ్లు
అప్పటికే అతడికి మూడు పెళ్లిళ్లు జరిగినట్లు తనకు తెలిసిందని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాను మారినట్లు మళ్లీ తన వద్దకు వచ్చాడని చెప్పింది. అనంతరం తనకు కొడుకు పుట్టాక మళ్లీ అదృశ్యమయ్యాడని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ వెతకడంతో మేరఠ్‌లో ఇద్దరు మహిళలతో అతడు దొరికాడని తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్‌హౌస్‌లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్