రుద్రవరం : నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో నీటి తొట్టిలో పడి ఏడాది చిన్నారి మృతి చెందిన సంఘటన పలువురిని కన్నీరు తెప్పించింది. వివరాల్లోకెళితే… గ్రామానికి చెందిన చిన్న రాయుడు, నీరజ దంపతులకు ఇద్దరు కుమారులు వీరిలో చిన్న కుమారుడు సూర్య(1) కు ఏడాది వయస్సు ఉంది. తల్లిదండ్రులు ఇంటిదగ్గర పనులు చేసుకుంటూ ఉండగా చిన్నారి సూర్య ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు దుఃఖంతో విలపించారు. చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025