కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విద్యార్థిని నేహా హిరేమఠ తండ్రి, కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమఠతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో నేహా హీరేమఠ మరణం విషయంలో వారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నిరంజన్ హిరేమఠ మాట్లాడుతూ తనని కలిసేందుకు వచ్చిన అమిత్ కు తన కుమార్తె నేహా హీరేమత్ మరణంపై న్యాయం చేయాలని కోరుతూ మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.
ఇలాంటి కేసుల్లో ఉరిశిక్ష ఉండేలా చూడాలని, ఇలాంటి కేసులను 90 నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. నిరంజన్ హిరేమఠ విజ్ఞప్తితో నేహా మరణంపై తగిన న్యాయం చేస్తామని అమిత్ షా ఇచ్చినట్లు నేహా హిరేమఠ తండ్రి నిరంజన్ హిరేమఠ వెల్లడించారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025