ఆమె హోంగార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ టెస్టులకు హాజరైంది. ఆ సమయంలో ఎక్కువ సేపు లైన్లో ఉండడంతో.. కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో అక్కడి నిర్వాహకులు ఆంబులెన్స్లోలో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. దీంతో పలువురు అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.
బీహార్ గయ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హోంగార్డ్ రిక్రూట్మెంట్లో భాగంగా ఫిజికల్ టెస్టులకు వెళ్లిన యువతి(26)పై అఘాయిత్యం జరిగింది. ఫిజికల్ టెస్టులో పాల్గొంటున్న ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో ఆంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో.. అదీ ఆంబులెన్స్లోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.
జులై 24వ తేదీన బోధగయలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పృహలోని తనపై ఆంబులెన్స్లో నలుగురు అత్యాచారం జరిపారని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ఇద్దరిని(ఆంబులెన్స్ డ్రైవర్తో సహా) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన రాజకీయంగానూ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో సిట్ను, ఫోరెన్సిక్ టీంను ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ ప్రకటించింది.
Also read
,
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025