విశాఖలోని అది చంద్రబాబునాయుడు కాలనీ ప్రాంతం. సత్యనారాయణస్వామి గుడికి వెళ్ళే మార్గంలో శివాలయం ఉంది. ఆ ఆలయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ నాగుపాము దర్శనమిచ్చింది. అది కూడా మాఘ పౌర్ణమి రోజు కనిపించడంతో భక్తులు భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. ఈ విషయం తెలసి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
మాఘపౌర్ణమి సందర్భంగా విశాఖలో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. ఓ ఆలయంలో అరుదైన ఘటన జరిగింది. ఎక్కడ నుంచి వచ్చిందో గానీ ఓ నాగుపాము శివలింగాన్ని చుట్టుకుంది. శివలింగానికి ఆభరణంలా కనిపించింది. ఈ సన్నివేశం చూసి అక్కడకు వచ్చిన భక్తులు ఆశ్చర్యపోయారు. విశేష పూజలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశాఖలోని అది చంద్రబాబునాయుడు కాలనీ ప్రాంతం. సత్యనారాయణస్వామి గుడికి వెళ్ళే మార్గంలో శివాలయం ఉంది. ఆ ఆలయంలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ నాగుపాము దర్శనమిచ్చింది. అది కూడా మాఘ పౌర్ణమి రోజు కనిపించడంతో భక్తులు భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. నాగు పాముకు ప్రత్యేక పూజలు చేశారు. విషయం ఆనోటా ఈ నోటా పాకడంతో ఆ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
పాము ఆలయంలోకి వెళ్తున్నట్టు.. అటు ఇటు తిరుగుతున్నట్టు.. ఆ వీడియోలో కనిపించింది. కాస్త నిడివి కట్ అయిన తర్వాత ఆ నాగుపాము శివలింగంపై దర్శనం ఇచ్చింది. శివలింగానికి చుట్టుకుని నాగాభరణంలా కనిపించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే.. ఈ పాము అప్పుడప్పుడు వస్తూ ఉంటుందని అంటున్నారు స్థానికులు. మాఘ పౌర్ణమి రోజు కనిపించడం నిజంగా అదృష్టమని అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు భక్తులు
Also read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి