July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

ఓటింగ్ రోజున దయచేసి ఇంట్లో నుంచి బయటికి రండి…*

*గుంటూరులో స్థానికులనే గెలిపించుకుందాం…*

అమరావతి:

బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన *సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ* ఎల్లుండి 13వ తేదీ 2024 జరిగే ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా డా. పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా గల్లా మాధవిల ను, గుంటూరు పార్లమెంటు పరిధిలోని శాసనసభ అభ్యర్థులందరికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ధర్మాన్ని గెలిపించవలసిందిగా,ఈ జగనాసుర పాలనను ఓటు అనే ఆయుధం ద్వారా అంతమొందించాల్సిందిగా శ్రీధర్ కోరారు. గుంటూరు నగరంలో ఉన్న ఈ ముగ్గురు అభ్యర్థులు స్థానికులని వైసీపీ అభ్యర్థినీ విడుదల రజిని స్థానికేతరురాలుగా, చిలకలూరిపేట చిలకమ్మ అని,ఆమె ఈ నగరానికి  లేని వ్యక్తి అని తెలియజేశారు. స్థానికులతోనే నగర అభివృద్ధి సాధ్యపడుతుందని, అలానే ఓటింగ్ రోజున అపార్ట్మెంట్ వాసులు ధనవంతుల కుటుంబాలు, వ్యాపార వర్గాల వారు తప్పనిసరిగా ఇంట్లోంచి బయటికి వచ్చి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఎవరైతే ఓటు వేయరో వారికి ఎన్నికల కమిషన్ వారు ఫైన్ వేయబోతున్నట్లు తెలిపారు. మంచి అభ్యర్థుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత  ప్రజలందరి పైన ఉందని, అయితే నగరాలు, పట్టణాల్లో ఉన్న అపార్ట్మెంట్ వాసులు, ధనవంతులు, విద్యాధికులై ఉండి కూడా ప్రజాప్రతినిధి ఎంపికలో ఓటు వేయకుండా ఉంటున్నారని , ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అవకుండా నిరక్షరాస్యుల కన్నా ఘోరంగా తయారయ్యారని, వీరు బద్ధకం వదిలి ప్రజా ప్రభుత్వాన్ని ఓటు ద్వారా ఎన్నుకోవాలని,నేరుగా తమ ఓటు సద్వినియోగం పరుచుకోపోతే మీ ఓట్లని దొంగ ఓట్లు వేసే పరిస్థితిని, అవకాశాన్ని మీకు,మీరే కల్పించిన వారు అవుతారని, ఎన్నికల రోజున పోలింగ్ బూత్ దగ్గర ఓటర్ క్యు లైన్ ఉంటే లైన్ లో నిలబడి ఓటు వేయటం నామోషీగా భావించి, పోలింగ్ బూతు వరకు వెళ్లి వెనుతిరుగుతున్నారని, పౌరుడిగా ఓటు వేసే బాధ్యతను మరిచి ఇండ్లలో టీవీలకు, సెల్ ఫోన్ లకు అతుక్కుపోకుండా తమ రాజ్యాంగ హక్కుని తప్పక వినియోగించుకోవాలని, రాజకీయ పార్టీల వారు పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు పోలింగ్ బూత్ ల దగ్గర ఘర్షణలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారాలు వ్యాప్తింప చేస్తారని వాటిని నమ్మి ఓటు హక్కు వినియోగించుకోకపోతే మీ ఓటుని వేరే వాళ్ళు వేసే అవకాశం కల్పించిన వారవుతారని అందువల్ల తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా శ్రీధర్ పిలుపునిచ్చారు.

Also read

Related posts

Share via