పుష్ప-2 సినిమా ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. అభిమాని హీరో సినిమా చూడటానికి కుతూహలంతో వెళ్లిన ఓ కుటుంబానికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. సంతోషంగా సినిమా చూడటానికి వెళ్లిన ఓ మహిళ చివరకు శవమై తిరిగి వచ్చిన ఘటన అందరినీ కలచివేస్తోంది.
పుష్ప-2 రిలీజ్ వేళ ఓ వైపు బన్నీ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటుండగా.. మరోవైపు అదే సినిమా వల్ల ఓ కుటుంబం బలైపోయింది. సినిమా చూడాలనే కుతూహలంతో థియేటర్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి చివరికి ఆవేదనే మిగిలింది. సినిమా కారణంగా ఓ మహిళ మృతి.. బన్నీ ఫ్యాన్స్‌ను సైతం కంటితడిపెట్టిస్తోంది
ఒకే కుటుంబానికి చెందిన వారు..
దిల్‌సుఖ్‌నగర్‌కి చెందిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రీమియర్ షోకి వెళ్లారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఆ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటి వరకు ఏ మూవీ రిలీజ్ రోజు ఇలా ఒకే కుటుంబానికి చెందిన వారికి జరగలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ లాంఛ్ సమయాల్లో వేర్వేరు కుటుంబాలకి చెందిన వారు గాయాల పాలయ్యారు. కానీ ఒకే కుటుంబానికి చెందిన వారికి ఇలా జరగడం ఇదే మొదటిసారి
సినిమా చూసి సంతోషంగా ఇంటికి రావాల్సిన కుటుంబం ఆసుపత్రి పాలైంది. పుష్ప-2 సినిమా కారణంగా ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాథులుగా మారారు. ఎవరైనా సంతోషం కోసం సినిమాకి వెళ్తుంటారు. కానీ ఈ పుష్ప-2 సినిమా ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఈ సినిమా ఒక్క రాత్రిలోనే సంతోషంగా ఉన్న కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ విషాద సంఘటన దేశ వ్యాప్తంగా అందరినీ కలవరపెడుతోంది. హీరోపై అభిమానం ఉండవచ్చు. కానీ ప్రాణాలను పణంగా పెట్టేంత అభిమానం ఉండకూడదు. మితిమీరిన అభిమానం వల్లనే ఈ రోజు ఆ కుటుంబం చీకట్లోకి వెళ్లింది.
ప్రాణాలు పెట్టి మరి ప్రీమియర్ షోలకు వెళ్లే కల్చర్ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపిస్తోంది. అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి. అంతే కానీ ప్రాణలకు తెగించి వెళ్తే.. దాని ప్రభావం ఒక్కరి మీదే కాకుండా మొత్తం కుటుంబం మీద పడుతుంది. ఇలాంటి కల్చర్‌ను ఉండకూడదని, ఉంటే అభిమాని హీరో మూవీ రిలీజ్ రోజు ఇలాంటి ఎందరో ప్రాణాలు కోల్పోతారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ విషాద ఘటనపై ఇప్పటి వరకు అల్లు అర్జున్ స్పందించలేదు. మరి ఈ కుటుంబాన్ని అల్లు అర్జున్ ఆదుకుంటాడా? లేదా? అనేది చూడాలి.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..