తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సంచలనం రేపుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్‌తో జోగులాంబ ఆలయానికి వెళ్తున్న నాగసాధువును ఉండవల్లి బైరాపురం వద్ద పోలీసులు అడ్డుకుని కారుతోపాటు ఈడ్చుకెళ్లారు.
BREAKING: తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సంచలనం రేపుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్‌తో జోగులాంబ ఆలయానికి వెళ్తున్న నాగసాధువును ఉండవల్లి బైరాపురం వద్ద పోలీసుల బృందం అడ్డుకుని కారుతోపాటు ఈడ్చుకెళ్లింది
దర్గా కూల్చివేయాలంటూ..
ఈ మేరకు అలంపూర్‌లోని 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శాలి పహిల్వాన్ దర్గాను తొలగించాలని డిమాండ్ చేస్తోంది అఘోరి. ఇందులో భాగంగానే అలంపూర్ వెళ్తున్న అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. ఉండవెల్లి మండలం బైరాపురం చౌరస్తా దగ్గర ఆఘోరీ నాగసాధువును కారుతోపాటు ఈడ్చుకెళ్లారు. పోలీసులతో కాసేపు వాగ్వాదం పెట్టుకున్న అఘోరి.. హల్ చల్ చేసింది. దీంతో అఘోరి కార్ ను టోయింగ్ వాహనంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇక 700 సంవత్సరాల చరిత్ర కలిగిన శాలి పహిల్వాన్ దర్గాను తొలగించాలంటూ అఘోరీ నాగ సాధువు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. దీంతో శాంతి భద్రతలు ఆగాథం తలెత్తకుండా ముందస్తుగా అఘోరీని అలంపూర్ ఆలయాలకు రాకుండా అడ్డుకుని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అఘోరీ కారులో విగ్రహాలు, పూజలకు సంబంధించిన సామాగ్రి ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఈ అరెస్టు ఇష్యూలో సీఐలు, ఇద్దరు మహిళ ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.
Also Read
- Durgs : శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!
- Crime News: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేస్తూ.. చివరికి!
- Ranya Rao: కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..! రన్యా రావు సంచలన స్టేట్మెంట్
- శిశువును మంటలపై తలకిందులుగా వేలాడదీసిన భూతవైద్యుడు.. చివరికీ