November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

విద్యుత్ ఘాతంతో జూనియర్ లైన్మెన్ మృతి





రేగిడి:  ఆ ఉద్యోగి సచివాలయంలో విద్యుత్ శాఖలో ఉద్యోగంలో చేరి ఐదేళ్లు అయింది. చదివి ప్రయోజకుడయ్యాడని తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో ఉన్నారు. పేదరికంలో ఉండి సచివాలయ ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని ముందుకు తీసుకు వెళ్లే విధంగా ఆదుకున్నాడని ఆ కుటుంబం సంతోషం ఎన్నాళ్లు లేదు. వారి ఆశలు నీరుగారింది. ఇటీవల మాధవరావుకు పెళ్లి సంబంధం తల్లిదండ్రులు చూసిన సందర్భాలు ఉన్నాయి. వీచిన గాలులకు పంట పొలాల్లో విద్యుత్ తీగలు పడి ఉండడంతో అది గమనించక మృత్యువాత పడ్డారు. సచివాలయం ఉద్యోగంలో లైన్ మేన్ గా చేరి ఐదేళ్లకే విధి వెక్కిరించిందని కుటుంబ సభ్యుల రోధన వర్ణనాతీతం. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు……. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన బూరాడ మాధవరావు (30) శనివారం విద్యుదాఘాతంతో అక్కడకక్కడే మృతి చెందాడు.. మృతుడు బూరాడ మాధవరావు సంతకవిటి మండలం మోదుగులపేట సచివాలయంలో జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం గాలివాన కు గ్రామంలో ఓ పంట పొలంలో విద్యుత్ వైర్ తెగిపడింది. విద్యుత్ వైర్లు తెగిపడి ఉండడంతో విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు శనివారం విద్యుత్ వైర్లు సరిచేసే దిశగా అటుగా వెళ్లిన మాధవరావు వైరు సరిచేసే క్రమంలో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పంట పొలాలకు వెళ్లిన రైతు కూలీలు మృతి చెందిన మాధవరావు ను సూచి గ్రామానికి సమాచారం అందించారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు… శివపంచినాము నిర్వహించి, రాజాం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సిరిపురంలో విషాదఛాయలు
మోదుగుల పేటలో సచివాలయం ఉద్యోగుగా పనిచేసిన బూరాడ మాధవరావు విద్యుత్ ఘాతంతో మృతి చెందడం సిరిపురం గ్రామంలో విషాదఛాయలు అలమ కున్నాయి.. పేదరికం నుంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకుంటాడని అనుకున్న తరుణంలో విధి వెక్కిరించి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిందని రోదిస్తున్నారు.. ప్రభుత్వాన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు..

Also read

Related posts

Share via