దొడ్డబళ్లాపురం/బనశంకరి: మంగళూరులో గత గురువారం రాత్రి హిందూ కార్యకర్త సుహాన్శెట్టి హత్య తరువాత నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రజల్లో భయం నెలకొంది. ఇంతలో మరో హిందూ కార్యకర్త భరత్ కుమ్టేల్ను సోమవారం రాత్రి 9-30కి హత్య చేస్తామని కొందరు గుర్తుతెలియని దుండగులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి నుంచి అన్ని వ్యాపార, వ్యవహారాలను రోజూ రాత్రి 9:30కి బంద్ చేయాలని ఆదేశించారు. రేవు సిటీలో పరిస్థితులు చక్కబడే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
హెడ్కానిస్టేబుల్ హస్తం
సుహాస్ శెట్టి హత్యలో రోజు కొత్త సంగతులు బయటపడుతున్నాయి. రషీద్ అనే హెడ్కానిస్టేబుల్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుహాన్శెట్టి బజ్పేలో ఇంట్లో ఉండగా రషీద్ కావాలనే ఠాణాకు పిలిపించి వేధించేవాడని ఆరోపణలున్నాయి. వాహనంలో ఎలాంటి ఆయుధాలు ఉండరాదు, నీ జతలో స్నేహితులు ఉండరాదని హెచ్చరించాడని సుహానెశెట్టి తల్లి ఆరోపించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025