భర్త బలవంతంగా గర్భస్రావం మాత్రలు వేయడంతో ఆరు నెలల గర్భిణి తీవ్ర రక్తస్రావమై మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ లో జరిగింది. ఆమె సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు భర్త ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య, గర్భిణి చేత ఆమె భర్త బలవంతంగా గర్భస్రావం మాత్రలు వేయడంతో ఆమె తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది. ఏఎస్‌ఐ మారుతి వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన ప్రవళిక(23)కు అదే గ్రామానికి చెందిన సేపుర్‌వార్ ప్రశాంత్‌తో మూడేళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ప్రవళిక ఆరు నెలల గర్భవతిగా ఉంది. అయితే శుక్రవారం రాత్రి ప్రవళిక భర్త ప్రశాంత్ గుర్తు తెలియని మాత్రలను తీసుకువచ్చి ఆమె చేత బలవంతంగా మింగించాడు. దీంతో అప్పటి నుంచి ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది.
వెంటనే ట్రీట్ మెంట్ కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. గర్భస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని రిమ్స్ వైద్యుల సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవళిక శనివారం రాత్రి మృతి చెందారు. ఆమె సోదరుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు భర్త ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కొత్తగా ఇంటి పనులు చేపట్టడం, అదే సమయంలో భార్య గర్భవతిగా ఉండకూడదన్న మూఢనమ్మకంతో భర్త ప్రశాంత్ గర్భస్రావ మాత్రలు ఇచ్చాడా లేదా ఇంకేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.
Also read
- Central Jail Kadapa : జైల్లో ఖైదీలకు మొబైల్ సరఫరా.. ఐదుగురిపై సస్పెన్షన్ వేటు
- ఉప్పల్ లో ఎస్ఐ పై దాడి..కాలర్ పట్టుకొని…
- Sexual Harassment: నారాయణఖేడ్ బీసీ గర్ల్స్ హాస్టల్లో కాంగ్రెస్ నేత లైంగిక వేధింపులు..అమ్మాయిల గదుల్లోకి వెళ్లి…
- Chittoor: ఇద్దరు వ్యక్తులు, నలుగురు మహిళలు.. గుడి పక్కన గుట్టుచప్పుడు యవ్వారం.. సీన్ కట్ చేస్తే.!
- Hyderabad: ఆ అమ్మాయికి, ఆత్మీయ బంధాలకు దూరమయ్యా.. చనిపోయే ముందు విద్యార్థి ఏం చెప్పాడంటే..