ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదు అయింది. దీంతో ఆమెను పోలీసులు విచారించారు.
Actor SriReddy : ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదు అయింది. దీంతో ఆమెను పూసపటి రేగకు తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై శ్రీరెడ్డి ఆరోపణలు చేశారని స్థానిక కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు
కాగా 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పార్టీకి నటి శ్రీరెడ్డి మద్దతు తెలిపారు. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాకుండా టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలను అప్పట్లో రెండు పార్టీల నాయకులు వ్యతిరేకించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. కానీ పట్టించుకోలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన నాయకులు ఆయా పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 6 కేసులలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఫిబ్రవరి 24న హైకోర్టు విచారణ జరిపింది.
అయితే, చిత్తూరు వన్‌టౌన్ ఠాణా పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ బెయిలబుల్ స్వభావం ఉండటంతో శ్రీరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది హైకోర్టు. ఇక, విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు పలు షరతులు విధించింది. రూ.10 వేలతో 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే కర్నూలు టూటౌన్, కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్, విజయనగరం జిల్లా నెలిమర్ల ఠాణాలో నమోదైన కేసులలో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్నవేనని తెలిపింది.
అయితే రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కేసులు నమోదవ్వడంతో శ్రీరెడ్డి తనను క్షమించాలని కోరారు. ఇకపై రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు. సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌కు శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు. తనను క్షమించాలని, ఇకపై నోరు జారనని మన్నించాలని కోరారు. అయితే కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం శ్రీరెడ్డిపై గుర్రుగానే ఉన్నారు. ఇందులో భాగంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమెను విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు విచారించారు.
Also read
- India Pak War Live: జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత
- జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత.. డ్రోన్ దాడులకు పాక్ యత్నం
- ఇస్రో కేంద్రాల వద్ద హై అలెర్ట్.. పాక్ దాడుల నేపథ్యంలో శ్రీహరి కోట భద్రత కట్టుదిట్టం.
- Tirumala Temple: తిరుమలలో హై అలెర్ట్.. టెంపుల్ టౌన్ లో ఏరియా డామినేషన్ పై ఫోకస్.
- 400 టర్కిష్ డ్రోన్లతో భారత్‌పై దాడి! ఆ డ్రోన్లు పాక్‌కు ఎక్కడివి? అవి ఎలా పని చేస్తాయి.. ఎంత డేంజర్? పూర్తి వివరాలు