March 16, 2025
SGSTV NEWS
CrimeTelangana

Crime News: మద్యం మత్తులో యాసిడ్ తాగాడు..  వ్యక్తి మృతి!


మద్యం మత్తులో బాత్రూమ్ లోని యాసిడ్  తాగి ఓ వ్యక్తి  మృతి చెందాడు. ఈ ఘటన  శంషాబాద్ మండలంలో చోటుచేసుకుంది. కుమ్మరి ఆనందచారి (62) శుక్రవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. మద్యం మత్తులో రాత్రి 9.30 గంటలకు బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగాడు.

Crime News: మద్యం మత్తులో బాత్రూమ్ లోని యాసిడ్  తాగి ఓ వ్యక్తి  మృతి చెందాడు. ఈ ఘటన  శంషాబాద్ మండలంలో చోటుచేసుకుంది. నర్కూడకు చెందిన కుమ్మరి ఆనందచారి (62) శుక్రవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. సాయంత్రం 6.30గంటలకు ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు.  అయితే మద్యం మత్తులో రాత్రి 9.30 గంటలకు బాత్రూంలోకి వెళ్లాడు. అక్కడ యాసిడ్ తాగి  బయటకు వచ్చాడు. ఆనందచారి చొక్కాపై పసుపు మరకలు ఉండడంతో అతని భార్య లక్ష్మి గమనించి బాత్రూమ్ లోకి వెళ్లి చూసింది. యాసిడ్ బాటిల్ ఓపెన్ చేసి , సగమే ఉండడడంతో వెంటనే ఆనందచారిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత ఆనందచారి  చనిపోయాడు. కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు.

హ్యాపీ హోలీ అంటూ యాసిడ్ దాడి
ఇక హోలీ పండగ వేళ హైదరాబాద్ లో దారుణం జరిగింది.  సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తు్న్న నర్సింగ్ రావుపై యాసిడ్ ఎటాక్ జరిగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆలయం లోపలికి వచ్చి హ్యాపీ హోలీ అంటూ అతని తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నర్సింగరావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా..  ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘటనతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. ముందుగానే నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

Also read

Related posts

Share via