SGSTV NEWS
Andhra PradeshCrime

బాలికపై అత్యాచార కేసులో నిందితుడు అరెస్టు

ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌పి కె.ప్రతాప్‌ శివకిషోర్‌ తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లా రెట్టచింతల మండలం కుమ్మరికోట గ్రామానికి చెందిన మిర్యాల జయరావు లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఓ పని నిమిత్తం నూజివీడుకు వచ్చి ఆదివారం రాత్రి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు 2019లో రెంటచింతల ప్రాంతంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లాడని, ప్రస్తుతం బెయిల్‌పై బయట తిరుగుతున్నాడు. ఘటన జరిగిన రోజు నిందితుడి కోసం నూజివీడు డిఎస్‌పితోపాటు మరో నలుగురు సిఐల నేతృత్వంలో నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు ఓ వాహనంలో ప్రయాణిస్తుండగా మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌పి చెప్పారు.

Also read

Related posts

Share this