అనంతపురం : అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహాళ్‌లో సోమవారం రాత్రి రామాంజనేయస్వామి రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతపురం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి పి.జగదీష్ ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. హనకనహాల్ గ్రామానికి చెందిన వైసిపి మద్దతుదారుడు బొడిమల్ల ఈశ్వరరెడ్డి… పెట్రోల్ పోసి రథానికి నిప్పు అంటించినట్లు విచారణలో తేలింది. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. గ్రామంలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో రథానికి నిప్పుపెట్టినట్లు విచారణలో తేలిందని ఎస్‌పి చెప్పారు. ఈ ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





