Aadhaar Card: ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ కీలకమైన అప్‌డేట్ జారీ చేసింది. మీ ఆధార్ కార్డు సుదీర్ఘకాలంగా అప్‌డేట్ కాకపోతే రద్దయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే యాక్టివేషన్ అంత సులభం కాదు. ఎందుకంటే రద్దయిన ఆధార్ కార్డును ఆధార్ సెంటర్లో రీ యాక్టివేట్ చేయించలేరు.
ప్రస్తుతం ప్రభుత్వం, ప్రైవేట్ పనులకు ఆధార్ కార్డు అనేది అత్యవసరంగా మారింది. ఆధార్ కార్డు లేకుండా ఏ పనీ జరగని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పధకాలకు, బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు అవసరం దృష్ట్యా యూఐడీఏఐ కీలకమైన అప్‌డేట్స్ ఇస్తోంది. పదేళ్లుగా ఎవరైనా తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయకుంటే వెంటనే సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుంటే మీ ఆధార్ కార్డు రద్దయిపోతుది. ఒకసారి రద్దయితే మాత్రం దానిని యాక్టివేట్ చేసేందుకు ఢిల్లీలోని యూఐడీఏఐ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. యూఐడీఏఐ ప్రతి 8-10 ఏళ్లకు ఆధార్ కార్డును వెరిఫై చేస్తుంటుంది. ఈ సమయంలో ఆధార్ కార్డు అప్‌డేట్ కాకుంటే వాటిని రద్దు చేస్తుంది. ఏయే ఆధార్ కార్డులు యాక్టివ్ గా ఉన్నాయో చెక్ చేసేందుకు యూఐడీఏఐ వెరిఫికేషన్ చేస్తుంటుంది.
ఒకసారి ఆధార్ కార్డు రద్దయితే రీ యాక్టివేట్ చేసేందుకు ఢిల్లీలోని యూఐడీఏఐ కార్యాలయానికి వెళ్లాల్సిందే. స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్లలో ఇది సాధ్యం కాదు. చాలామందికి అడ్రస్ లేదా పేరు మార్చాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు ప్రతి 8 లేదా 10 ఏళ్లకు కనీసం ఫోటో అప్‌డేట్ చేసుకోవాలి. ఫోటో ప్రూఫ్ కోసం ఓటర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అప్‌లోడ్ చేయవచ్చు. ఆధార్ కార్డులో ఫింగర్ బయోమెట్రిక్, ఐరిస్, ఫేస్ బయోమెట్రిక్ వివరాలు ఎప్పుడూ అప్‌డేట్ చేస్తుండాలి.
